Allari Naresh: తమన్ చేతుల మీదుగా 'ఆ ఒక్కటీ అడక్కు' సాంగ్ రిలీజ్

Aa Okkati Adakku Movie Lyrical Song Released

  • అల్లరి నరేశ్ హీరోగా రూపొందిన 'ఆ ఒక్కటీ అడక్కు'
  • ఆయన జోడీగా అలరించనున్న ఫరియా అబ్దుల్లా
  • సంగీతాన్ని సమకూర్చిన గోపీసుందర్  
  • ఈ నెల 22వ తేదీన సినిమా విడుదల


అల్లరి నరేశ్ 61వ సినిమా కొంత కాలంగా చిత్రీకరణ జరుపుకుంటూ వెళుతోంది. రీసెంటుగా ఈ సినిమాకి 'ఆ ఒక్కటీ అడక్కు' అనే టైటిల్ ను ఖరారు చేశారు. టైటిల్ పోస్టర్ తోనే ఈ సినిమాపై ఆడియన్స్ లో ఆసక్తిని పెంచడంలో మేకర్స్ సక్సెస్ అయ్యారు. గతంలో ఈవీవీ దర్శకత్వంలో ఇదే టైటిల్ తో వచ్చిన రాజేంద్రప్రసాద్ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. 

అయితే ఆ కథకీ ... ఈ సినిమాకి ఎలాంటి సంబంధం లేదు. ఈ సినిమాలో అల్లరి నరేశ్ హీరోగా నటించాడు. ఆయన సరసన నాయికగా ఫరియా అబ్దుల్లా సందడి చేయనుంది. రాజీవ్ నిర్మించిన ఈ సినిమాకి, మల్లి దర్శకత్వం వహించాడు. వెన్నెల కిశోర్ .. వైవా హర్ష ముఖ్యమైన పాత్రలలో కనిపించనున్నారు. 

కొంతసేపటి క్రితం ఈ సినిమా నుంచి తమన్ చేతుల మీదుగా ఒక లిరికల్ సాంగును రిలీజ్ చేశారు. 'ఓయమ్మా  కొంచెం ఆగవే .. మనసు చెప్పే మాటను పూర్తిగా వినవే .. నీ బొమ్మ మదిలో ఉన్నదిలే' అంటూ ఈ పాట సాగుతోంది. గోపీసుందర్ స్వరపరిచిన ఈ బాణీకి భాస్కర భట్ల సాహిత్యాన్ని అందించగా, అనురాగ్ కులకర్ణి ఆలపించాడు.

More Telugu News