KCR: తెలంగాణలో కీలక పరిణామం... కేసీఆర్‌తో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ భేటీ

RS Praveen kumar meets former cm kcr

  • నందినగర్‌లోని కేసీఆర్ నివాసంలో కలిసిన బీఎస్పీ తెలంగాణ చీఫ్
  • బీఆర్ఎస్, బీఎస్పీ పొత్తు ఊహాగానాల నేపథ్యంలో భేటీకి ప్రాధాన్యత
  • నాగర్ కర్నూల్ నుంచి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బరిలోకి దిగుతారని జోరుగా ప్రచారం

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను నందినగర్‌లోని ఆయన నివాసంలో బీఎస్పీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. త్వరలో పార్లమెంట్ ఎన్నికలు ఉన్న సమయంలో వీరిద్దరి భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది. లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్, బీఎస్పీ కలిసి పోటీ చేస్తాయని... నాగర్ కర్నూల్ లోక్ సభ స్థానం నుంచి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బరిలోకి దిగే అవకాశాలు ఉన్నాయని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు వీరి కలయిక ఈ ఊహాగానాలకు బలం చేకూరుస్తున్నాయి. ఈ సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు హరీశ్ రావు, వేముల ప్రశాంత్, బాల్క సుమన్‌తో పాటు పలువురు బీఎస్పీ నాయకులు పాల్గొన్నారు.

KCR
rs praveen kumar
Telangana
Lok Sabha Polls
BRS

More Telugu News