IPL 2024: ఐపీఎల్‌కు రెడీ అవుతున్న జట్లు.. అత్యధిక ధర పలికిన ఈ కెప్టెన్ల గురించి తెలుసా?

IPL 2024 Highest Paid Captains Are Here

  • ఈ నెల 22 నుంచి ఐపీఎల్ నయా సీజన్
  • వ్యూహ ప్రతివ్యూహాలు సిద్ధం చేసుకుంటున్న జట్లు
  • అత్యధిక ధర పలికిన కెప్టెన్‌గా పాట్ కమిన్స్ రికార్డు

ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2024కు సర్వం సిద్ధమైంది. ఈ నెల 22 నుంచి నయా సీజన్ ప్రారంభం కానుండగా ఆటగాళ్లు ఒక్కొక్కరుగా భారత్‌లో వాలిపోతున్నారు. గత సీజన్‌లో పేలవ ప్రదర్శన కనబరిచిన జట్లు ఈసారి సత్తా చాటాలని ఉవ్విళ్లూరుతున్నాయి. అందుకు తగ్గ వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నాయి. ఈసారి మార్కరమ్‌కు ఉద్వాసన పలికిన సన్‌రైజర్స్ జట్టు అత్యధిక ధరపెట్టి కొనుగోలు చేసిన ఆస్ట్రేలియా ప్రపంచకప్ విన్నింగ్ కెప్టెన్‌ పాట్ కమిన్స్‌కు పగ్గాలు అప్పగించింది. ఈ నేపథ్యంలో అత్యధిక ధర అందుకుంటున్న కెప్టెన్లు ఎవరో చూద్దాం.

ఆటగాళ్లుజట్టుధర (రూ. కోట్లలో)
పాట్ కమిన్స్ 
సన్ రైజర్స్ హైదరాబాద్ 
20.5 
కేఎల్ రాహుల్ 
లక్నో సూపర్ జెయింట్స్ 
17 
రిషభ్‌పంత్ 
ఢిల్లీ కేపిటల్స్ 
16 
హార్దిక్ పాండ్యా 
ముంబై ఇండియన్స్ 
15 
సంజు శాంసన్ 
రాజస్థాన్ రాయల్స్ 
14 
శ్రేయాస్ అయ్యర్ 
కోల్‌కతా నైట్ రైడర్స్ 
12.25 
ఎంఎస్ ధోనీ 
చెన్నై సూపర్ కింగ్స్ 
12 
శిఖర్ ధావన్ 
పంజాబ్ కింగ్స్ 
8.25 
శుభమన్ గిల్ 
గుజరాత్ టైటాన్స్ 

ఫా డుప్లెసిస్ 
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు 
 7 

IPL 2024
Pat Cummins
KL Rahul
Rishabh Pant
SRH
DC
LSG
  • Loading...

More Telugu News