Ramcharan: అనంత్ అంబానీ పెళ్లిలో రామ్ చరణ్ ని అవమానించిన షారుక్ ఖాన్?

Shahrukh Khan insulted Ramcharan

  • వేదికపై డ్యాన్స్ చేసిన షారుక్, సల్మాన్, ఆమిర్
  • చరణ్ ను వేదిక పైకి పిలిచిన షారుక్
  • ఇడ్లీ సాంబార్ అని పిలవడంపై మండిపడుతున్న అభిమానులు

మన దేశ శ్రీమంతుడు ముఖేశ్ అంబానీ కొడుకు అనంత్ అంబానీ, రాధికల ప్రీవెడ్డింగ్ వేడుకలు గుజరాత్ లోని జామ్ నగర్ లో అంగరంగ వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. ఈ వేడుకలకు దేశ విదేశాలకు చెందిన ప్రముఖులు హాజరయ్యారు. సినీ తారలు, క్రికెట్ దిగ్గజాలు ఈ వేడుకల్లో మెరిశారు. మరోవైపు ఈ వేడుకల్లో టాలీవుడ్ స్టార్ రామ్ చరణ్ కు అవమానం జరిగిందనే వార్త వైరల్ అవుతోంది. 

వివరాల్లోకి వెళ్తే ప్రీవెడ్డింగ్ వేడుకలకు రామ్ చరణ్ తన భార్య ఉపాసనతో కలిసి వెళ్లిన సంగతి తెలిసిందే. వేడుకల సందర్భంగా వేదికపై షారుక్ ఖాన్, సల్మాన్ ఖాన్, ఆమిర్ ఖాన్ లు డ్యాన్స్ చేశారు. ఈ సందర్భంగా చరణ్ ను షారుక్ ఖాన్ వేదికపైకి పిలిచారట. అయితే, చరణ్ ను పిలిచే సందర్భంగా... 'ఇడ్లీ సాంబార్' పైకి రా అని షారుక్ అన్నారట. ఈ విషయాన్ని ఉపాసన మేకప్ ఆర్టిస్ట్ జెబా హసన్ సోషల్ మీడియాలో వెల్లడించింది. చరణ్ ను ఇండ్లీ సాంబార్ అంటూ షారుక్ పిలవడం నచ్చలేదని ఆమె పోస్ట్ పెట్టింది. 

చరణ్ ను షారుక్ పిలిచిన విధానంపై పలువురు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. సరదాగానే పిలిచినప్పటికీ అది సరికాదని... ఒక పెద్ద స్టార్ హీరోను అవమానించడం తగదని అంటున్నారు. సౌత్ ఇండియా అంటే షారుక్ కు అంత చులకన భావమా? అని మరి కొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. షారుక్ పై చరణ్ అభిమానులు మండిపడుతున్నారు.

Ramcharan
Shahrukh Khan
Tollywood
Bollywood
Mukesh Ambani
Anant Ambani
  • Loading...

More Telugu News