Mix Up: ఆహా తెరపైకి వచ్చేస్తున్న బోల్డ్ కంటెంట్ .. 'మిక్సప్'

Mix Up Movie Update

  • రొమాన్స్ ప్రధానంగా నడిచే 'మిక్సప్'
  • రెండు జంటల చుట్టూ తిరిగే కథ 
  • టీజర్ తో అందరిలో పెరిగిన ఆసక్తి 
  • ఈ నెల 15వ తేదీ నుంచి స్ట్రీమింగ్


ఇంతకుముందు బోల్డ్ కంటెంట్ అనేది బాలీవుడ్ సిరీస్ ల ద్వారా ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్ పైకి ఎక్కువగా వచ్చేది. కానీ ఇక తెలుగులో కూడా బోల్డ్ కంటెంట్ తలుపులు తెరుచుకున్నట్టే అనుకోవాలి. 'మిక్సప్' అనే ఓటీటీ సినిమాకి సంబంధించి వచ్చిన టీజర్ చూస్తే ఈ విషయం అర్థమవుతుంది. టీజర్ ను వదిలిన దగ్గర నుంచి యూత్ లో ఆసక్తి ఒక్కసారిగా పెరిగిపోయింది.

ప్రధానమైన రెండు జంటల చుట్టూ ఈ కథ నడుస్తుంది. ఒక జంటలో ఒకరికి .. మరొక జంటలో ఒకరికి శృంగారం అంటే అంతగా ఇష్టం ఉండదు. వాళ్లు తమ పార్ట్నర్ నుంచి ప్రేమను కోరుకుంటూ ఉంటారు. భార్యాభర్తల మధ్య బంధాన్ని కలిపి ఉంచేదే శృంగారం అనే అభిప్రాయంతో మరో ఇద్దరు ఉంటారు.   అక్షర గౌడ .. ఆదర్శ్ బాలకృష్ణ .. కమల్ కామరాజు .. పూజా జవేరి ప్రధానమైన పాత్రలను పోషించారు.    
 
ఆకాశ్ బిక్కీ ఈ సినిమాకి దర్శకత్వం వహించాడు. ఈ నెల 15వ తేదీ నుంచి ఈ సినిమాను స్ట్రీమింగ్ చేయనున్నారు. అందుకు సంబంధించిన పోస్టర్ ను కొంతసేపటి క్రితం రిలీజ్ చేశారు. ఆ మధ్య హిందీలో వచ్చిన లస్ట్ స్టోరీస్ గురించి చాలాకాలం పాటు చెప్పుకున్నారు. అదే తరహాలో కనిపిస్తున్న  ఈ సినిమా ఎలాంటి రెస్పాన్స్ ను తెచ్చుకుంటుందో చూడాలి.

Mix Up
Akshara Gouda
Adarsh Balakrishna
Kamal Kamaraju
  • Loading...

More Telugu News