Telangana DSC: తెలంగాణ మెగా డీఎస్సీ దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం... పూర్తి వివరాలతో బులెటిన్ విడుదల

Telangana DSC information bulletin released

  • నేటి నుంచి ఏప్రిల్ 2 వరకు దరఖాస్తుల స్వీకరణ  
  • డీఎస్సీ పరీక్ష కోసం దరఖాస్తును ఆన్‌లైన్‌లోనే నింపాలి...
  • మహబూబ్ నగర్, రంగారెడ్డి, మైదరాబాద్, మెదక్, నిజామాబాద్, అదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, నల్లగొండ, సంగారెడ్డిలలో పరీక్ష కేంద్రాలు
  • రిక్రూట్మెంట్ పరీక్షలు మే-జూన్ నెలల్లో నిర్వహించే అవకాశం 

మెగా డీఎస్సీ దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమైంది. ఈ రోజు (మార్చి 4) నుంచి దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. నేటి నుంచి ఏప్రిల్ 2 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులను స్వీకరించనున్నారు. దరఖాస్తుకు సంబంధించి ఈ రోజు సమగ్ర వివరాలతో విద్యాశాఖ బులెటిన్‌ను విడుదల చేసింది.  

డీఎస్సీ పరీక్ష కోసం దరఖాస్తును ఆన్‌లైన్‌లోనే నింపాలి. దరఖాస్తుదారులు అన్ని వివరాలను పొందుపరచాలి. దరఖాస్తుదారు సంతకంతో కూడిన పాస్ పోర్ట్ సైజ్ ఫోటోను జతపరచాలి. పరీక్ష ఫీజు రూ.1,000గా ఉంది. అయితే పరీక్ష ఎప్పుడు ఉంటుందో వెల్లడించలేదు. కానీ పరీక్ష కేంద్రాలను పేర్కొన్నారు. మహబూబ్ నగర్, రంగారెడ్డి, మైదరాబాద్, మెదక్, నిజామాబాద్, అదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, నల్లగొండ, సంగారెడ్డిలలో కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.

ఎక్కడ ఎన్ని ఖాళీలు?

అత్యధికంగా హైదరాబాద్‌లో 878 ఖాళీలు ఉన్నాయి. నల్గొండలో 605, నిజామాబాద్‌లో 601, ఖమ్మంలో 757, సంగారెడ్డిలో 551, కామారెడ్డిలో 506 ఖాళీలు ఉన్నాయి.

తెలంగాణ విద్యా శాఖ 11,602 ఉపాధ్యాయ పోస్టుల కోసం డీఎస్సీ నోటిఫికేషన్‌ను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ రిక్రూట్మెంట్ పరీక్షలు మే-జూన్ నెలల్లో నిర్వహించే అవకాశముంది. స్కూల్ అసిస్టెంట్, లాంగ్వేజ్ పండిట్, ఫిజికల్ ఎడ్యుకేషన్ ఉపాధ్యాయులతో పాటు సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టుల కోసం నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. తెలంగాణ విద్యా శాఖ దీంతో పాటు మరో నోటిఫికేషన్‌ను కూడా విడుదల చేసింది.

డీఎస్సీ ద్వారా 6,508 సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయులు (ఎస్జీటీ), 2,629 స్కూల్ అసిస్టెంట్లు, 727 లాంగ్వేజ్ పండిట్స్, 182 ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్లు (పీఈటీ), 1,106 స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్లు, 79 స్కూల్ అసిస్టెంట్ కేడర్ కింద భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం నోటిఫై చేసిన 5,089 ఖాళీలు కూడా ఉన్నాయి.

More Telugu News