Prashant Kishor: ప్రశాంత్ కిశోర్ వ్యాఖ్యలపై విజయసాయిరెడ్డి స్పందన

Vijayasai Reddy reacts on Prashant Kishore comments

  • ఏపీలో వైసీపీకి ఓటమి తప్పదన్న ప్రశాంత్ కిశోర్
  • జగన్ ఏం చేసినా గెలవడని వ్యాఖ్యలు
  • ప్రశాంత్ కిశోర్ పై మండిపడుతున్న వైసీపీ నేతలు
  • ప్రశాంత్ కిశోర్ అంచనాలకు ఆధారాలు లేవన్న విజయసాయి

ఈసారి ఎన్నికల్లో వైసీపీకి భారీ ఓటమి తప్పదని, మరోసారి గెలవాలనుకుంటున్న జగన్ ఆశలు నెరవేరబోవని మాజీ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ చేసిన వ్యాఖ్యలు వైసీపీ నేతలను తీవ్ర ఆగ్రహానికి గురిచేస్తున్నాయి. దీనిపై వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి స్పందించారు. 

చంద్రబాబుతో 4 గంటల పాటు సమావేశమైన అనంతరం తాను ఏం మాట్లాడుతున్నాడో ప్రశాంత్ కిశోర్ కే తెలియడంలేదని విమర్శించారు. ఎలాంటి సహేతుకమైన సమాచారం లేకుండా అసంబద్ధ ప్రేలాపనలు చేస్తున్న ప్రశాంత్ కిశోర్ అంచనాలపై ఆధారపడితే అంతే సంగతులు అని వ్యాఖ్యానించారు. 

ప్రశాంత్ కిశోర్ చెబుతున్నదానికి, సమకాలీన రాజకీయ పరిస్థితులకు ఏమాత్రం పొంతన లేదని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. కరోనా సంక్షోభం సమయంలో ఏపీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు కోట్లాది మంది ప్రజల ప్రాణాలు కాపాడాయని, ప్రజలకు రక్షణ వలయంలా మారాయని వివరించారు.

Prashant Kishor
Vijayasai Reddy
YSRCP
Elections
Andhra Pradesh
  • Loading...

More Telugu News