Jeevitha Rajasekhar: నేను మాట్లాడటం తగ్గించింది ఇందుకే: జీవిత రాజశేఖర్

Jeevitha Rajasekhar Interview

  • తన పిల్లలు ఇండస్ట్రీలో ఉన్నారన్న జీవిత 
  • వాళ్ల కెరియర్ పైనే ఎక్కువ ఫోకస్ చేశామని వెల్లడి 
  • తమ కారణంగా పిల్లలు ఇబ్బంది పడకూడదని వ్యాఖ్య 
  • తనకి భయమనేది తెలియదని వివరణ 


జీవిత రాజశేఖర్ ..  ఏ విషయంలోనైనా నిర్మొహమాటంగా వ్యవహరిస్తారు. అందువలన జీవిత - రాజశేఖర్ ఇద్దరూ కూడా కొన్ని వివాదాలను ఫేస్ చేయవలసి వచ్చింది. కొన్ని ఇబ్బందులను ఎదుర్కోవలసి వచ్చింది. తాజాగా ఒక యూ ట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో జీవిత మాట్లాడుతూ, పలు విషయాలు ప్రస్తావించారు. 

  "నేను .. రాజశేఖర్ గారు ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడుతూ ఉంటాము. అందువలన కొన్ని సమస్యలు ఎదురైన మాట నిజమే. మా ఇద్దరి వరకూ అలా నడిచింది .. కానీ ఇప్పుడు పిల్లలు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. మేమంటే పడనివారి వలన, మా పిల్లల కెరియర్ ఎఫెక్ట్ కాకూడదు. మా కారణంగా వాళ్లకి ఇబ్బందులు ఎదురుకాకూడదు. ఈ విషయాన్ని గురించి నేను .. రాజశేఖర్ గారు కలిసి మాట్లాడుకున్నాము" అని అన్నారు. 

"నేను .. రాజశేఖర్ గారు చాలా కెరియర్ చూశాము. ఇక ఇప్పుడు పిల్లల వంతు .. మేము లేకుండా వాళ్లు చాలా దూరం ప్రయాణించవలసి ఉంటుంది. అందువలన వాళ్ల కెరియర్ పై ఎక్కువగా దృష్టిపెట్టడం జరిగింది. ఈ మధ్య కాలంలో నేను కాస్త తక్కువగా మాట్లాడటం కూడా ఒక కారణం. అయితే ఇది భయపడటం మాత్రం కాదు. ఎవరికీ భయపడే స్వభావం కాదు నాది" అని చెప్పారు.

Jeevitha Rajasekhar
Actress
Shivani
Shivathmika
  • Loading...

More Telugu News