Pawan Singh: బీజేపీ టికెట్ ను నిరాకరించిన భోజ్ పురి స్టార్

Bhojpuri star Pawan Singh rejects BJP ticket
  • అసన్సోల్ టికెట్ ను పవన్ సింగ్ కు కేటాయించిన బీజేపీ
  • కొన్ని కారణాల వల్ల పోటీ చేయలేనన్న పవన్ సింగ్
  • భోజ్ పురి అగ్ర నటుల్లో ఒకరిగా కొనసాగుతున్న పవన్
లోక్ సభ ఎన్నికల్లో విజయం సాధించి హ్యాట్రిక్ కొట్టాలనే పట్టుదలతో బీజేపీ ఉంది. బీజేపీ టికెట్ల కోసం తీవ్ర పోటీ కూడా నెలకొంది. టికెట్ కోసం ఎంతో మంది విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు, బీజేపీ టికెట్ ను ఓ అభ్యర్థి తిరస్కరించారు. తనను క్షమించాలని సోషల్ మీడియాలో పోస్ట్ కూడా పెట్టాడు. ఆయన మరెవరో కాడు ప్రముఖ భోజ్ పురి హీరో పవన్ సింగ్. 

బీజేపీ తన తొలి జాబితాలోనే పవన్ సింగ్ పేరును ప్రకటించింది. పశ్చిమ బెంగాల్ లోని అసన్సోల్ నియోజక వర్గం టికెట్ ను పవన్ కు బీజేపీ హైకమాండ్ కేటాయించింది. అయితే టికెట్ ను వపన్ తిరస్కరించారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను ఉద్దేశిస్తూ ట్వీట్ చేశారు. కొన్ని కారణాల వల్ల తాను ఎన్నికల్లో పోటీ చేయలేనని పవన్ సింగ్ తెలిపారు. తనకు టికెట్ కేటాయించిన బీజేపీ అగ్ర నాయకత్వానికి ధన్యవాదాలు తెలుపుతున్నానని చెప్పారు. పవన్ సింగ్ ది బీహార్ లోని అర్రా. భోజ్ పురి సినీ పరిశ్రమలో అగ్ర నటుల్లో ఒకరిగా ఆయన కొనసాగుతున్నారు. అభిమానులు ఆయనను పవర్ స్టార్ అని పిలుచుకుంటారు.
Pawan Singh
Bhojpuri
BJP

More Telugu News