TATA IPL-2024: వేరే లెవల్లో ఉంది... టాటా ఐపీఎల్-2024 ప్రోమో వీడియో ఇదిగో!

TATA IPL 20204 promo out now

  • మార్చి 22 నుంచి ఐపీఎల్ 17వ సీజన్
  • ఏప్రిల్ లో భారత్ లో ఎన్నికలు
  • రెండు వారాలకు తాత్కాలికంగా ఐపీఎల్ షెడ్యూల్ ప్రకటన
  • ఎన్నికల నోటిఫికేషన్ వచ్చాక పూర్తి షెడ్యూల్ విడుదల 
  • ఐపీఎల్ ను ప్రత్యక్ష ప్రసారం చేస్తున్న స్టార్ స్పోర్ట్స్ 

భారత్ లో ఈ వేసవి అటు ఎన్నికలు, ఇటు ఐపీఎల్ 17వ సీజన్ తో మరింత వేడెక్కనుంది. మార్చి 22న ఐపీఎల్-2024 టోర్నీ ప్రారంభం కానుంది. ఐపీఎల్ అంటే క్రికెట్ అభిమానుల్లో ఎంతటి క్రేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. క్రికెట్ వినోదాన్ని మరో స్థాయికి తీసుకెళ్లిన ఈవెంట్ ఏదైనా ఉందంటే అది ఐపీఎల్. 

ఈసారి కూడా ఐపీఎల్ ను స్టార్ స్పార్ట్స్ చానల్ ప్రత్యక్ష ప్రసారం చేయనుంది. ఈ నేపథ్యంలో, టాటా ఐపీఎల్-2024 ప్రోమోను విడుదల చేసింది. ఈ యాడ్ వీడియోలో రిషబ్ పంత్, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా తమదైన శైలిలో రక్తి కట్టించారు. 

ఏప్రిల్ లో సాధారణ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో, ఈసారి ఐపీఎల్ పూర్తి షెడ్యూల్ ను ప్రకటించలేదు.  మార్చి 22 నుంచి ఏప్రిల్ 7 వరకు కేవలం రెండు వారాలకు మాత్రమే షెడ్యూల్ ప్రకటించారు. ఈ వ్యవధిలో 21 మ్యాచ్ లు నిర్వహించనున్నారు. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చాక... తేదీలు సర్దుబాటు చేసుకుని పూర్తి షెడ్యూల్ ప్రకటించనున్నారు.

TATA IPL-2024
Promo
Star Sports
Video
India

More Telugu News