Hyderabad: మరో ఐదు రోజులు మండే ఎండలే.. హైదరాబాదీలకు అలర్ట్

Record Temparatures in Hyderabad Says IMD

  • ఫిబ్రవరి చివరి నుంచే పెరుగుతున్న ఉష్ణోగ్రతలు
  • ఈ నెల 7 వరకూ ఎండలు మాడ్చేస్తాయన్న వాతావరణ శాఖ
  • 37 డిగ్రీల నుంచి 40 డిగ్రీల టెంపరేచర్ నమోదవుతుందని హెచ్చరిక

ఈ ఏడాది ఫిబ్రవరిలోనే ఎండల తీవ్రత పెరిగిపోయింది. చివరి వారం నుంచే ఉష్ణోగ్రతలు గరిష్ఠానికి చేరాయి. ఉదయం, సాయంకాలం కాస్త చల్లగా ఉన్నప్పటికీ మధ్యాహ్నం మాత్రం సూర్యుడు విజృంభిస్తున్నాడు. వారం రోజులుగా మాడ్చేస్తున్న ఎండల తీవ్రత మరో ఐదు రోజులు కొనసాగుతుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ముఖ్యంగా హైదరాబాద్ లో ఈ నెల 7 వరకు గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని పేర్కొంది. రోజువారీ టెంపరేచర్ 37 డిగ్రీల నుంచి 40 డిగ్రీల వరకు చేరుతుందని అధికారులు చెబుతున్నారు. 

గురువారం వరకు పగటి పూట 40 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. హైదరాబాద్ లో రాత్రి వేళల్లోనూ సాధారణ ఉష్ణోగ్రతలు పెరుగుతాయని చెప్పారు. వారం రోజులుగా ఎండల తీవ్రతకు నగర వాసులు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఇళ్ల నుంచి బయటకు రావాలంటేనే భయపడే పరిస్థితి నెలకొందని చెబుతున్నారు. మార్చి మొదటి వారంలోనే ఇలా ఉంటే ముందు ముందు ఎండల తీవ్రత ఎలా ఉండనుందోననే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Hyderabad
Hot Summer
Temparatures
IMD
Alert
  • Loading...

More Telugu News