Varalaxmi Sarathkumar: ముంబయి వ్యాపారవేత్తతో వరలక్ష్మి శరత్ కుమార్ నిశ్చితార్థం... ఫొటోలు ఇవిగో!

Varalaxmi Sarathkumar engagement with Nicholai Sachdev

  • పెళ్లి పీటలు ఎక్కబోతున్న నటి వరలక్ష్మి శరత్ కుమార్
  • నికోలాయ్ సచ్ దేవ్ తో నిశ్చితార్థం
  • కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల నడుమ ఎంగేజ్ మెంట్

ప్రముఖ దక్షిణాది నటి వరలక్ష్మి శరత్ కుమార్ త్వరలో పెళ్లిపీటలు ఎక్కబోతున్నారు.. ముంబయికి చెందిన వ్యాపారవేత్త నికోలాయ్ సచ్ దేవ్ తో ఆమె నిశ్చితార్థం ఘనంగా జరిగింది. కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల నడుమ ముంబయిలో నిన్న నిశ్చితార్థ కార్యక్రమం నిర్వహించారు. వరలక్ష్మి ప్రముఖ నటుడు శరత్ కుమార్ కుమార్తె అన్న విషయం తెలిసిందే. వరలక్ష్మికి నికోలాయ్ తో గత పద్నాలుగేళ్లుగా పరిచయం ఉన్నట్టు తెలుస్తోంది. వీరి వివాహం వచ్చే ఏడాది జరిగే అవకాశం ఉంది. 

వరలక్ష్మి మనసు దోచిన నికోలాయ్ సచ్ దేవ్ వ్యాపారవేత్తగానే కాకుండా, కళలను ప్రోత్సహించే వ్యక్తిగానూ గుర్తింపు పొందారు. ఆకట్టుకునే పెయింటింగ్ లతో ఆర్ట్ గ్యాలరీలు ఏర్పాటు చేయడమే కాకుండా, వాటిని ఆన్ లైన్ లోనూ విక్రయిస్తుంటారు.

Varalaxmi Sarathkumar
Nicholai Sachdev
Engagement
Mumbai
  • Loading...

More Telugu News