Heart Beat: హాట్ స్టార్ తెరపైకి 'హార్ట్ బీట్' సిరీస్!

Heart Beat Web Series Update

  • ట్రైనీ వైద్యుల నేపథ్యంలో 'హార్ట్ బీట్'
  • తమిళంలో రూపొందిన వెబ్ సిరీస్
  • హాట్ స్టార్ చేతికి స్ట్రీమింగ్ హక్కులు 
  • ఈ నెల 8వ తేదీ నుంచి స్ట్రీమింగ్ 


ఈ మధ్య కాలంలో హారర్ థ్రిల్లర్ సిరీస్ లు .. క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ లు .. ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్ పైకి ఎక్కువగా వస్తున్నాయి. కానీ హాస్పిటల్ .. డాక్టర్స్ నేపథ్యంలో మాత్రం పెద్దగా సిరీస్ లు రాలేదు. గతంలో ఈ తరహా కంటెంట్ తో టీవీ సీరియల్స్ వచ్చాయిగానీ, సిరీస్ లను మాత్రం వ్రేళ్లపైనే లెక్కించవచ్చు. 

అలాంటి ఒక కంటెంట్ తో త్వరలో ఒక వెబ్ సిరీస్ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆ సిరీస్ పేరే 'హార్ట్ బీట్'. ఇది తమిళ సిరీస్ .. ఈ నెల 8వ తేదీ నుంచి 'డిస్నీ ప్లస్ హాట్ స్టార్'లో స్ట్రీమింగ్ కానుంది. అందుకు సంబంధించిన ప్రమోషన్స్ జోరుగా నడుస్తున్నాయి. ట్రైనీ డాక్టర్ 'రీనా' పాత్ర చుట్టూ ఈ కథ తిరుగుతుంది. 

అది ఒక పెద్ద హాస్పిటల్ .. ట్రైనీ డాక్టర్ గా మొదటి రోజునే 'రీనా' ఆలస్యంగా వస్తుంది. తన ధోరణి కారణంగా ఆమె సీనియర్ డాక్టర్ రాధిక కోపానికి గురవుతుంది. అప్పటి నుంచి ఆమెకి అక్కడ ఇబ్బందులు మొదలవుతాయి. అప్పుడు ఆమె ఏం చేస్తుంది? ఆమె నేపథ్యం ఏమిటి? అనేదే కథ. అనుమోలు .. దీపాబాలు .. యోగలక్ష్మి .. చారుకేశ్ .. శబరీశ్ ముఖ్యమైన పాత్రలను పోషించారు.

Heart Beat
Anumol
Deepa Balu
Yoga Lakshmi
Charukesh
  • Loading...

More Telugu News