Jagan: అక్టోబరు-డిసెంబరు 2023 త్రైమాసికం విద్యా దీవెన నిధులు విడుదల చేసిన సీఎం జగన్
- పామర్రులో నేడు జగనన్న విద్యా దీవెన నిధుల విడుదల
- రాష్ట్రంలో 9.45 లక్షల మంది విద్యార్థులు
- వారిలో 93 శాతం మందికి విద్యా దీవెన
- నేడు రూ.708 కోట్లు విడుదల చేసిన సీఎం జగన్
జగనన్న విద్యా దీవెన పథకం అక్టోబరు-డిసెంబరు 2023 త్రైమాసికం నిధులను ఏపీ సీఎం జగన్ నేడు విడుదల చేశారు. కృష్ణా జిల్లా పామర్రులో జరిగిన కార్యక్రమంలో సీఎం జగన్ బటన్ నొక్కి నిధులు విడుదల చేశారు.
రాష్ట్రవ్యాప్తంగా చదువుకుంటున్న 9.45 లక్షల మంది పిల్లల్లో 93 శాతం మంది విద్యా దీవెన పథకం ద్వారా లబ్ధి పొందుతున్నారని సీఎం జగన్ వివరించారు. అక్టోబరు-డిసెంబరు 2023 త్రైమాసికానికి సంబంధించి రూ.708 కోట్లు విడుదల చేశామని చెప్పారు. గత 57 నెలల కాలంలో విద్యా దీవెన రూపంలో రూ.12,609 కోట్లు అక్కచెల్లెమ్మల ఖాతాల్లో జమ చేశామని వెల్లడించారు.
వసతి దీవెన ద్వారా ఇప్పటిదాకా రూ.4,275 కోట్లు చెల్లించామని తెలిపారు. వసతి దీవెన కింద ఏప్రిల్ లో మరో రూ.1,100 కోట్లు విడుదల చేయనున్నామని సీఎం జగన్ పేర్కొన్నారు.