Nita Ambani: నా కుమారుడి పెళ్లికి సంబంధించి నాకు రెండు కోరికలు ఉన్నాయి: నీతా అంబానీ

I have two desires of my sons wedding says Nita Ambani

  • రాధికతో ముఖేశ్ అంబానీ కుమారుడు అనంత్ పెళ్లి
  • ప్రీ వెడ్డింగ్ వేడుకలతో సందడిగా మారిన జామ్ నగర్
  • అతిథులను ఆహ్వానిస్తూ నీతా అంబానీ ప్రత్యేక సందేశం

భారతదేశ శ్రీమంతుడు ముఖేశ్ అంబానీ తనయుడు అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ వేడులకతో గుజరాత్ లోని జామ్ నగర్ సందడిగా మారింది. ఎన్ కోర్ హెల్త్ కేర్ సీఈఓ వీరేన్ మర్చంట్ కుమార్తె రాధికను అనంత్ పెళ్లాడబోతున్నాడు. దేశ, విదేశాల నుంచి వస్తున్న ప్రముఖుల రాకతో జామ్ నగర్ లో సందడి నెలకొంది. సినీ తారలు, వ్యాపారవేత్తలు, పారిశ్రామికవేత్తలు, రాజకీయ నాయకులు జామ్ నగర్ కు తరలి వస్తున్నారు. వీరిని ఆహ్వానించేందుకు ఎయిర్ పోర్టుల్లో కూడా స్వాగత తోరణాలు ఏర్పాటు చేశారు. మెటా అధినేత మార్క్ జుకర్ బర్గ్ కూడా తన భార్యతో కలిసి జామ్ నగర్ చేరుకున్నారు. బిల్ గేట్స్ కూడా రానున్నారు. 

మరోవైపు, అతిథులను ఆహ్వానిస్తూ ముఖేశ్ అంబానీ భార్య నీతా అంబానీ ఒక ప్రత్యేక వీడియో సందేశాన్ని ఇచ్చారు. తమ చిన్న కుమారుడు అనంత్ - రాధికల విషయంలో తనకు రెండు కోరికలు ఉన్నాయని ఆమె చెప్పారు. మొదటిది... మన మూలాలను గుర్తుంచుకునేలా వివాహ వేడుకలను నిర్వహించాలని భావించామని తెలిపారు. రెండోది... ఈ వేడుకలు మన సంస్కృతి, దేశ వారసత్వం, కళలను ప్రతిబింబించేలా ఉండాలని అనుకున్నామని చెప్పారు. జామ్ నగర్ తమ హృదయాలకు ఎంతో దగ్గరైన ప్రాంతమని... తన కెరీర్ ను తాను ఇక్కడే ప్రారంభించానని తెలిపారు.

Nita Ambani
Mukesh Ambani
Son
Marriage
Pre Wedding
  • Loading...

More Telugu News