Maharashtra: మహారాష్ట్ర ప్రతిపక్ష పార్టీల్లో కొలిక్కి వచ్చిన సీట్ల పంపకం.. కాంగ్రెస్ ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తుందంటే..!

Congress In Maharashtra Will Contest In 18 Seats In Up Coming Elections

  • మహారాష్ట్రలో మొత్తం 48 లోక్‌సభ స్థానాలు
  • 20 స్థానాల్లో ఉద్ధవ్ శివసేన, 18 స్థానాల్లో కాంగ్రెస్, 10 స్థానాల్లో ఎన్సీపీ పోటీ
  • తన షేర్ నుంచి వీబీఏకు రెండు స్థానాలు ఇవ్వనున్న శివసేన
  • ఇండిపెండెంట్ అభ్యర్థి రాజుశెట్టికి ఒక స్థానం ఇవ్వనున్న ఎన్సీపీ

లోక్‌సభ ఎన్నికల వేళ మహారాష్ట్ర ప్రతిపక్షాల మధ్య సీట్ల పంపకం కొలిక్కి వచ్చింది. మహా వికాస్ అఘాడీ కూటమి మరో 48 గంటల్లో ఇందుకు సంబంధించి ప్రకటన చేసే అవకాశం ఉంది. రాష్ట్రంలోని మొత్తం 48 లోక్‌సభ స్థానాల్లో మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే సారథ్యంలోని శివసేన 20 స్థానాల్లో పోటీ చేయనుంది. కాంగ్రెస్ 18,  శరద్ పవార్ సారథ్యంలోని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సీపీ) 10 స్థానాల్లో బరిలో నిలవనుంది.

ప్రాంతీయ పార్టీలైన వంచిత్ బహుజన్ అఘాడీ (వీబీఏ) తో శివసేన (యూబీటీ) రెండు స్థానాలు స్థానాలు పంచుకోనుండగా, పవార్ షేర్ నుంచి ఇండిపెండెంట్ అభ్యర్థి రాజు శెట్టి పోటీ చేయనున్నారు. ఇక, ముంబైలోని ఆరు లోక్‌సభ స్థానాల్లో సేన (యూబీటీ) నాలుగింటిలో బరిలోకి దిగనున్నట్టు తెలుస్తోంది. ముంబై నార్త్‌ఈస్ట్ సీటును వీబీఏకు ఇచ్చే అవకాశముంది.

  • Loading...

More Telugu News