Chejarla Subbareddy: వైసీపీకి రాజీనామా చేసిన నెల్లూరు జిల్లా పార్టీ ప్రధాన కార్యదర్శి చేజర్ల సుబ్బారెడ్డి

Chejarla Subbareddy resigns YSRCP

  • నెల్లూరు జిల్లాలో ఇప్పటికే వైసీపీకి దూరమైన పలువురు ప్రజాప్రతినిధులు
  • ఎంపీ వేమిరెడ్డితోనే తన ప్రయాణమంటూ పార్టీకి గుడ్ బై చెప్పిన సుబ్బారెడ్డి
  • వేమిరెడ్డితో కలిసి టీడీపీలో చేరతానని వెల్లడి

నెల్లూరు జిల్లాలో ఇప్పటికే పలువురు ప్రజాప్రతినిధులు వైసీపీకి దూరమయ్యారు. తాజాగా, నెల్లూరు జిల్లా వైసీపీ ప్రధాన కార్యదర్శి చేజర్ల సుబ్బారెడ్డి కూడా పార్టీకి గుడ్ బై చెప్పారు. ఆయన ఇవాళ వైసీపీకి రాజీనామా చేశారు. ఇటీవలే వైసీపీని వీడిన ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డితోనే తన ప్రయాణమని చేజర్ల సుబ్బారెడ్డి స్పష్టం చేశారు. వేమిరెడ్డితో కలిసి టీడీపీలో చేరతానని వెల్లడించారు. 

ఉదయగిరి నియోజకవర్గానికి చెందిన చేజర్ల సుబ్బారెడ్డి ఎంపీపీగా తన ప్రస్థానం సాగించారు. జిల్లాలో వైసీపీకి విధేయుడిగా గుర్తింపు పొందారు. టీడీపీకి దగ్గరైన ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డిపై తీవ్రస్థాయిలో పోరాటం చేశారు. మేకపాటి... వైసీపీ అధిష్ఠానంపై విమర్శలు చేసినప్పుడల్లా చేజర్ల సుబ్బారెడ్డి వాటిని తిప్పికొడుతూ వచ్చారు. ఇప్పుడు ఆయనే వైసీపీని వీడడం జిల్లాలో మారిన రాజకీయ పరిస్థితులకు నిదర్శనం.

Chejarla Subbareddy
Resignation
YSRCP
Nellore District

More Telugu News