Ambati Rambabu: పవన్ కి నాలుగో పెళ్ళాం నాదెండ్ల మనోహర్: అంబటి

Nadendla Manohar is 4th wife of Pawan Kalyan says Ambati
  • జగన్ ను తొక్కడం పవన్ వల్ల కాదన్న అంబటి
  • పవన్ ను నమ్ముకుంటే కుక్కతోక పట్టుకుని గోదారి ఈదినట్టేనని ఎద్దేవా
  • పవన్ చీప్ బ్లాక్ మెయిలింగ్ కు పాల్పడుతున్నాడని విమర్శ
జనసేన అధినేత పవన్ కల్యాణ్, ఆ పార్టీ కీలక నేత నాదెండ్ల మనోహర్ పై ఏపీ మంత్రి అంబటి రాంబాబు అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. పవన్ కల్యాణ్ నాలుగో పెళ్లాం నాదెండ్ల మనోహర్ అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జగన్ ను పాతాళానికి తొక్కేస్తానని పవన్ అన్నారని... అది జరగాలంటే పవన్ ను పుట్టించిన వాళ్లు రావాలని అన్నారు. పవన్ గొప్పా? లేక జగన్ గొప్పా? అనేది జనసైనికులే చెపుతారని అన్నారు. 

పవన్ అంటే తనకు ఎంతో గౌరవం ఉందని... ఆయన మంచి నటుడని అంబటి అన్నారు. అయితే ఆయన రాజకీయాలకు పనికిరారని చెప్పారు. పిచ్చిపిచ్చి సినిమా డైలాగులు కొడుతున్నారని విమర్శించారు. పవన్ చీప్ బ్లాక్ మెయిలింగ్ కు పాల్పడుతున్నారని... పవన్ ను నమ్ముకుంటే కుక్క తోక పట్టుకుని గోదారి ఈదినట్టేనని అన్నారు. చంద్రబాబును జైల్లో పెట్టినప్పుడు బాధ కలిగిందని పవన్ అన్నారని... మరి వంగవీటి రంగాను హత్య చేసినప్పుడు బాధ కలగలేదా? అని ప్రశ్నించారు. ముద్రగడను వేధించినప్పుడు బాధ కలగలేదా? అని అడిగారు.
Ambati Rambabu
Jagan
YSRCP
Pawan Kalyan
Nadendla Manohar
Janasena
Vangaveeti Ranga
Mudragada Padmanabham

More Telugu News