Imtiaz: వైసీపీలో చేరిన ఐఏఎస్ అధికారి ఇంతియాజ్

Ex IAS officer Imtiaz joins YSRCP

  • జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన ఇంతియాజ్
  • పార్టీలోకి సాదరంగా ఆహ్వానించిన జగన్
  • కర్నూలు అసెంబ్లీ టికెట్ ఇచ్చే అవకాశం

ఎన్నికల వేళ కర్నూలు వైసీపీలో కీలక పరిణామం చోటు చేసుకుంది. సీనియర్ ఐఏఎస్ అధికారి ఇంతియాజ్ వైసీపీలో చేరారు. ముఖ్యమంత్రి జగన్ సమక్షంలో ఆయన వైసీపీ కండువా కప్పుకున్నారు. ఇంతియాజ్ కు కండువా కప్పి, పార్టీలోకి జగన్ సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో రామసుబ్బారెడ్డి, కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్, కర్నూలు మేయర్ బీవై రామయ్య, మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి తదితరులు హాజరయ్యారు. ఇంతియాజ్ ఇప్పటికే ఐఏఎస్ పదవికి స్వచ్ఛంద పదవీ విరమణ చేశారు. గతంలో ఆయన సెర్ప్ సీఈఓగా, మైనార్టీ సంక్షేమ శాఖ కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించారు. కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థిగా ఇంతియాజ్ పేరును జగన్ పరిశీలిస్తున్నట్టు సమాచారం. 

Imtiaz
Kurnool
Jagan
YSRCP
  • Loading...

More Telugu News