Tantra: భయపెడుతున్న కంటెంట్ .. దూసుకుపోతున్న 'తంత్ర' ట్రైలర్!

Tantra Movie Update

  • అనన్య నాగళ్ల ప్రధానమైన పాత్రగా 'తంత్ర'
  • తాంత్రిక శక్తుల సాధన నేపథ్యంలో నడిచే కథ 
  • A సర్టిఫికెట్ తెచ్చుకున్న సినిమా 
  • ఈ నెల 15వ తేదీన ఈ సినిమా విడుదల   


అనన్య నాగళ్ల .. యూత్ కి ఈ పేరు బాగా తెలుసు. లుక్ పరంగాను .. నటన పరంగాను ఆమెకి మంచి మార్కులు పడుతూ ఉంటాయి. ఇంతవరకూ ఆమె ముఖ్యమైన పాత్రలను చేస్తూ వచ్చింది. అలాంటి అనన్య, తొలిసారిగా నాయిక ప్రధానమైన సినిమాలో నటించింది .. ఆ సినిమా పేరే 'తంత్ర'.ఫస్టు కాపీ మూవీ బ్యానర్ పై ఈ సినిమా రూపొందింది. 

శ్రీనివాస్ గోపిశెట్టి దర్శకత్వం వహించిన ఈ సినిమా నుంచి రీసెంట్ గా ట్రైలర్ వదిలారు. చాలా తక్కువ సమయంలో ఈ ట్రైలర్ 5 లక్షలకి పైగా వ్యూస్ ను రాబట్టింది. అందుకు సంబంధించిన పోస్టర్ ను ఈ సినిమా రిలీజ్ చేసింది. తాంత్రిక శక్తుల సాధన .. వాటి ప్రయోగం గురించిన సన్నివేశాలపై కట్ చేసిన ట్రైలర్ ఉత్కంఠను రేపుతోంది. 

అందమైన నాయికను వశపరచుకోవాలనుకోవడం .. అందుకోసం ఆమెపై తాంత్రిక శక్తిని ప్రయోగించడం .. ఆమెలో మార్పు రావడం వంటి సన్నివేశాలు కాస్త భయపెడుతూనే ఉంటాయి. సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ సినిమా, A సర్టిఫికెట్ ను తెచ్చుకుంది. 'పిల్ల బచ్చాలు ఈ సినిమాకి రావొద్దు' అంటూ మరింత ఆసక్తిని పెంచారు. ఈ నెల 15వ తేదీన ఈ సినిమాను విడుదల చేస్తున్నారు. ' మా ఊరి పొలిమేర' మాదిరిగానే 'తంత్ర' కూడా సక్సెస్ ను సాధిస్తుందేమో చూడాలి.

Tantra
Ananya Nagalla
Meesala lakshman
Srinivas

More Telugu News