Jaleel Khan: లోకేశ్‌ను కలిసిన జలీల్‌ఖాన్‌.. టీడీపీలోనే కొనసాగుతానని వెల్లడి

Jaleel Khan meets Nara Lokesh

  • వైసీపీలోకి వెళ్లాలని భావించిన జలీల్ ఖాన్
  • జలీల్ ఖాన్ తో చర్చలు జరిపిన కేశినేని చిన్ని
  • తన రాజకీయ భవిష్యత్తుకు లోకేశ్ హామీ ఇచ్చారన్న జలీల్

వైసీపీలోకి వెళ్లాలనుకున్న మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ మనసు మార్చుకున్నారు. టీడీపీలోనే ఉండాలని నిర్ణయించుకున్నారు. విజయవాడ టీడీపీ లోక్ సభ ఇన్ఛార్జీ కేశినేని చిన్ని... జలీల్ ఖాన్ తో చర్చలు జరిపారు. జలీల్ తో చిన్ని చర్చలు ఫలించాయి. ఈ క్రమంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ వద్దకు జలీల్ ఖాన్ ను చిన్ని తీసుకొచ్చారు. లోకేశ్ భేటీ అనంతరం మీడియాతో జలీల్ ఖాన్ మాట్లాడుతూ... తాను టీడీపీలోనే కొనసాగుతానని స్పష్టం చేశారు. తన రాజకీయ భవిష్యత్తుకు నారా లోకేశ్ హామీ ఇచ్చినట్టు తెలిపారు. టీడీపీ గెలుపు కోసం శాయశక్తులా కృషి చేస్తానని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా ముస్లింల మద్దతు కూడగట్టి తెలుగుదేశం పార్టీకి అండగా నిలబెడతానని తెలిపారు.

Jaleel Khan
Nara Lokesh
Kesineni Chinni
Telugudesam
  • Loading...

More Telugu News