Chalam: చలం - శారద వైవాహిక జీవితంపై స్పందించిన చలం తనయుడు రవిశంకర్!

Ravi Sjankar Chalam Interview

  • చలం గురించి ప్రస్తావించిన రవిశంకర్ 
  • తన తండ్రి చాలా సరదా మనిషని వ్యాఖ్య 
  • ఆయనది సాయం చేసే తత్త్వమని వెల్లడి 
  • కొన్ని కారణాల వలన చలం - శారద విడిపోయారని వివరణ


హీరో చలం - హీరోయిన్ శారద అప్పట్లో వివాహం చేసుకుని, చాలా కాలం పాటు కలిసున్నారు .. ఆ తరువాత విడిపోయారు. తాజాగా ఒక యూ ట్యూబ్ ఛానల్ కి చలం తనయుడు రవిశంకర్ ఇచ్చిన ఇంటర్వ్యూలో, ఆయనకి ఈ విషయానికి సంబంధించిన ప్రశ్న ఎదురైంది. అందుకు ఆయన తనదైన శైలిలో స్పందించారు.

"మా అమ్మ రమణకుమారిగారు చనిపోయిన తరువాతనే నాన్నగారు శారదగారిని వివాహం చేసుకున్నారు. అప్పట్లో అందరం కలిసే ఉండేవాళ్లం. నాన్నగారు - శారదగారు 14 ఏళ్లపాటు కలిసే ఉన్నారు. ఆ తరువాత కొన్ని కారణాల వలన విడిపోయారు. శారదగారిని మేము ఎంతో గౌరవించేవాళ్లం .. ఆ గౌరవభావం ఇప్పటికీ అలాగే ఉంది" అని అన్నారు. 

"మొదటి నుంచి కూడా నాన్న చాలా సరదా మనిషి. రాజ్ కపూర్ .. గురుదత్ గారి సినిమాలను ఆయన ఎక్కువగా చూసేవారు. సినిమాలు చూడటం కోసం ఆయన విమానాల్లో తిరిగిన రోజులున్నాయి. ఎన్ని  సినిమాలు నిర్మించినా ఎవరికీ ఒక్క రూపాయి కూడా బాకీ ఉండేవారు కాదు. మొదటి నుంచి ఆయనకి సాయం చేసే గుణం ఎక్కువే. ఆయన సినిమాలను తప్పకుండా చూస్తుంటానని రజనీకాంత్ గారు నాతో ఓ సందర్భంలో అన్నారు" అని గుర్తుచేసుకున్నారు. 

More Telugu News