Vemireddy Prabhakar Reddy: 2న టీడీపీలో చేరనున్న వైసీపీ రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి

YCP MP Vemireddy joins in TDP on March 2nd in Nellore

  • 2న నెల్లూరు, గురజాలలో చంద్రబాబు పర్యటన
  • నెల్లూరులో చంద్రబాబు సమక్షంలో వేమిరెడ్డి టీడీపీలో చేరిక
  • అదే రోజు గురజాలలో, 4న రాప్తాడులో ‘రా కదలి రా’ సభలు

వైసీపీ రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి టీడీపీలో చేరేందుకు ముహూర్తం ఖరారైంది. మార్చి 2న టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు నెల్లూరు, గురజాలలో పర్యటించనున్నారు. అదే రోజు ఉదయం నెల్లూరులో చంద్రబాబు సమక్షంలో వేమిరెడ్డి టీడీపీ తీర్థం పుచ్చుకుంటారు. అదే రోజు మధ్యాహ్నం 2 గంటలకు గురజాలలో నిర్వహించే ‘రా కదలి రా’ సభలో బాబు పాల్గొంటారు.

4న రాప్తాడు నియోజకవర్గంలో నిర్వహించే ‘రా కదలి రా’ సభలో టీడీపీ అధినేత పాల్గొంటారు. వచ్చే ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా కష్టపడుతున్న చంద్రబాబునాయుడు ఇప్పటి వరకు 22 ‘రా కదలి రా’ సభల్లో పాల్గొన్నారు. ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలోనూ ఓ సభను టీడీపీ నిర్వహిస్తోంది.

Vemireddy Prabhakar Reddy
Chandrababu
Telugudesam
Nellore
Gurajala
Raptadu
Ra Kadalira
  • Loading...

More Telugu News