Hari Rama Jogaiah: వారి ఖర్మ.. నేను చేయగలిగింది ఏమీ లేదు: హరిరామ జోగయ్య

Hari Rama Jogaiah letter to Chandrababu and Pawan Kalyan
  • పవన్ కు లేఖల ద్వారా పలు సూచనలు చేసిన జోగయ్య
  • ఆయన సూచనలను పట్టించుకోని పవన్
  • టీడీపీ, జనసేన బాగు కోరి సలహాలు ఇచ్చానన్న జోగయ్య
జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు మాజీ మంత్రి, కాపు సంక్షేమ సేన నేత హరిరామ జోగయ్య వరుస లేఖల ద్వారా పలు సూచనలు, సలహాలు ఇస్తూ వచ్చిన సంగతి తెలిసిందే. పొత్తులో భాగంగా టీడీపీ అధినేత చంద్రబాబును ఎన్ని సీట్లు అడగాలి, సీఎం సీటు షేరింగ్ కూడా ఉండాలంటూ ఆయన తన లేఖల్లో సూచనలు చేశారు. అయితే, ఆయన లేఖలకు పవన్ ఏనాడూ స్పందించలేదు. ఆయన సూచనలను పట్టించుకోలేదు. ఈ నేపథ్యంలో చంద్రబాబు, పవన్ లకు జోగయ్య బహిరంగ లేఖ రాశారు. 

తెలుగుదేశం, జనసేన బాగు కోరి తాను ఇచ్చే సలహాలు అధినేతలు ఇద్దరికీ నచ్చినట్టు లేవని... అది వారి ఖర్మ అని జోగయ్య అన్నారు. ఇక తాను చేయగలిగింది ఏమీ లేదు అని చెప్పారు. తన సలహాలను ఎవరూ పట్టించుకోక పోవడంతో ఆయన ఈ లేఖ రాశారు.
Hari Rama Jogaiah
Pawan Kalyan
Jana Reddy
Chandrababu
Telugudesam
Letter

More Telugu News