CPI Narayana: తండ్రి పేరు చెడగొట్టేందుకే జగన్ పుట్టాడు: సీపీఐ నారాయణ

CPI Narayana fires on Jagan

  • కేంద్రానికి జగన్ ఎప్పుడో లొంగిపోయారన్న నారాయణ
  • స్వార్థ ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టారని విమర్శ
  • తెలుగు వారి ఆత్మగౌరవం కోసం ఎన్టీఆర్ పోరాటం చేశారని వ్యాఖ్య

పిరికిపంద రాజకీయాలు చేసేవారు పాలిటిక్స్ లో ఉండటం సరికాదని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. సొంత ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రయోజనాలను పణంగా పెట్టొద్దని చెప్పారు. ముఖ్యమంత్రి జగన్ తన స్వార్థ ప్రయోజనాల కోసం ఏపీ ప్రయోజనాలను ప్రధాని మోదీ ముందు తాకట్టు పెట్టారని విమర్శించారు. కేంద్రానికి జగన్ ఎప్పుడో లొంగిపోయాడని అన్నారు. తండ్రి వైఎస్సార్ పేరు చెడగొట్టేందుకే జగన్ పుట్టాడని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తెలుగువారి ఆత్మగౌరవం కోసం ఎన్టీఆర్ పోరాటం చేశారని గుర్తు చేశారు. విభజన హామీలు అమలు చేయలేకపోయినా బీజేపీ కాళ్లను జగన్ పట్టుకుంటున్నారని మండిపడ్డారు. 17ఏ కత్తి పెట్టి చంద్రబాబును కూడా లొంగదీసుకోవాలనే ప్రయత్నం చేశారని అన్నారు. ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

CPI Narayana
Jagan
YSRCP
AP Politics
  • Loading...

More Telugu News