Gollapalli Surya Rao: చంద్రబాబుకు రాజీనామా లేఖ పంపిన మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు

Gollapalli Surya Rao resigns to TDP

  • టీడీపీకి గుడ్ బై చెప్పిన మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు
  • టీడీపీలో నిజాయతీకి గుర్తింపు లేకుండా పోయిందని ఆవేదన
  • దళిత వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటున్నారని విమర్శలు
  • జగన్ కు మద్దతుగా ఉండడం తన బాధ్యత అని వెల్లడి

కోనసీమ జిల్లాకు చెందిన మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు టీడీపీకి రాజీనామా చేశారు. రాజోలు టికెట్ ను ఆశిస్తున్న ఆయన తాజా పరిణామాలతో మనస్తాపానికి గురైనట్టు తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు చంద్రబాబును ఉద్దేశించి లేఖ విడుదల చేశారు. తన రాజీనామాను వెంటనే ఆమోదించాలని కోరారు. 

టీడీపీలో నిజాయతీకి గుర్తింపు లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. దళితులకు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకుంటున్నారని గొల్లపల్లి ధ్వజమెత్తారు. పార్టీలో తన ఆత్మగౌరవాన్ని దెబ్బతీశారని వాపోయారు. ఇలాంటి పరిస్థితుల్లో జగన్ కు మద్దతు ఇవ్వడం తన బాధ్యతగా భావిస్తున్నానని వివరించారు. 

ఇటీవల టీడీపీ మొదటి జాబితా విడుదల చేయగా, అందులో గొల్లపల్లి సూర్యారావు పేరు కనిపించలేదు. గత రాత్రి గొల్లపల్లి... విజయవాడ ఎంపీ కేశినేని నానితో భేటీ కావడంతోనే ఆయన వైసీపీలోకి వచ్చే విషయంపై స్పష్టత వచ్చింది.

Gollapalli Surya Rao
TDP
Resignation
Chandrababu
YSRCP
Andhra Pradesh
  • Loading...

More Telugu News