Nala Pamu: వైజాగ్ బీచ్ కు కొట్టుకువచ్చిన భారీ పాము కళేబరం

Nala Pamu At Vizag Beach

  • నల పాముగా పిలుస్తారన్న మత్స్యశాఖ అధికారులు
  • సాగర్ నగర్ బీచ్ లో కళేబరం 
  • వలలకు చిక్కిన పామును విడిచిపెట్టే క్రమంలో మృత్యువాత

వైజాగ్ తీరానికి మంగళవారం ఓ భారీ పాము కళేబరం కొట్టుకువచ్చింది. నగర పరిధిలోని సాగర్ నగర్ బీచ్ దగ్గర్లో ఈ కళేబరం కనిపించింది. సముద్రంలో అరుదుగా కనిపించే ఈ పామును నలపాముగా వ్యవహరిస్తారని మత్స్యశాఖ అధికారులు తెలిపారు. మత్స్యకారుల వలలకు చిక్కిన పామును తిరిగి సముద్రంలో విడిచిపెట్టే క్రమంలో ఇది చనిపోయి ఉంటుందని చెప్పారు. వలలో చిక్కుకోవడంతో భయాందోళనలకు గురై ఈ పాములు చనిపోతాయని వివరించారు. ఈ భారీ పాము కళేబరాన్ని చూసేందుకు చుట్టుపక్కల వారు గుడ్లవాని పాలెం అమ్మవార్ల ఆలయాల తీరానికి పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. ఫొటోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అవికాస్తా వైరల్ గా మారాయి.

Nala Pamu
Vizag beach
sagar nagar
Viral Pics
  • Loading...

More Telugu News