Jayasudha: శోభన్ బాబుగారు తాను చాలా ఫీల్ అవుతున్నట్టు చెప్పేవారు: జయసుధ

Jayasudha Interview

  • దాసరిగారు చాలా సీరియస్ గా ఉండేవారని వెల్లడి 
  • కృష్ణగారు తక్కువగా మాట్లాడేవారని వ్యాఖ్య 
  • శోభన్ బాబు సరదాగా ఉండేవారని వివరణ  


తెలుగులో కథానాయికగా జయసుధ ఒక వెలుగు వెలిగారు. సహజనటిగా ప్రేక్షకుల హృదయాలలో నిలిచిపోయారు. ఒక ఇంటర్వ్యూలో జయసుధ మాట్లాడుతూ .. " అప్పట్లో రాఘవేంద్రరావుగారు .. నారాయణరావుగారు స్టార్ డైరెక్టర్స్. రాఘవేంద్రరావుగారి సెట్లో చాలా సరదాగా ఉండేది. అందరం సరదాగా కబుర్లు చెప్పుకుంటూ .. షాట్ రెడీ అనగానే వర్క్ లో పడిపోయేవాళ్లం" అని అన్నారు. 

ఇక దాసరిగారి విషయానికి వస్తే .. సెట్లో ఇతర విషయాలను గురించి ఆయన మాట్లాడనీయరు .. జోకులు వేయనీయరు. చాలా సీరియస్ గా తన పనిచేసుకు వెళుతూ ఉండేవారు. అప్పట్లో కృష్ణగారు .. శోభన్ బాబు ఇద్దరూ చాలా హ్యాండ్సమ్. కృష్ణగారు ఎక్కువగా మాట్లాడేవారు కాదు. కానీ శోభన్ బాబుగారు అందరితో సరదాగా కబుర్లు చెబుతూ ఉండేవారు" అని చెప్పారు. 

"అప్పటి హీరోయిన్స్ లో చాలామంది తమ పర్సనల్ విషయాలను కూడా శోభన్ బాబుగారితో చెప్పుకునేవారు. బోయ్ ఫ్రెండ్స్ గురించిన విషయాలను కూడా ఆయన దగ్గర మాట్లాడేవారు. "మీ హీరోను నేను కదా .. మీరంతా నా దగ్గరే మీ బాయ్ ఫ్రెండ్స్ గురించి మాట్లాడుతుంటే నేనెంత ఫీలవుతున్నానో తెలుసా? అని నవ్వేవారు" అంటూ జయసుధ అప్పటి విషయాలను గుర్తుచేసుకున్నారు. 

Jayasudha
Actress
Sobhan Babu
Krishna
Dasari
  • Loading...

More Telugu News