Dastagiri: ఏపీ ప్రభుత్వం నుంచి నాకు ప్రాణహాని ఉంది... భద్రత కల్పించండి: తెలంగాణ సీఎంకు దస్తగిరి విజ్ఞప్తి

Dastagiri asks Telangana govt for security

  • వివేకా హత్య కేసులో దస్తగిరి అప్రూవర్ గా మారిన వైనం
  • ఈ కేసులో కీలకంగా మారిన దస్తగిరి వాంగ్మూలం
  • తనను వైసీపీ బెదిరిస్తోందని దస్తగిరి తాజా ఆరోపణలు

మాజీ ఎంపీ వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో అప్రూవర్ గా మారిన మాజీ డ్రైవర్ దస్తగిరి తన ప్రాణాలకు ముప్పు ఏర్పడిందంటూ తెలంగాణ ప్రభుత్వాన్ని ఆశ్రయించాడు. వివేకా హత్య కేసులో అప్రూవర్ గా మారినందుకు వైసీపీ బెదిరిస్తోందని దస్తగిరి ఆరోపించాడు. ఏపీ ప్రభుత్వంతో తనకు ప్రాణహాని ఉందని, భద్రత కల్పించాలని తెలంగాణ ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేస్తున్నా అని తెలిపాడు. సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో వివేకా హత్య కేసు విచారణ తెలంగాణ కోర్టులో జరుగుతున్న సంగతి తెలిసిందే.

ఇతర కేసుల గురించి స్పందిస్తూ... తాను ఎవరినీ కిడ్నాప్ చేయలేదని స్పష్టం చేశాడు. వివేకా హత్య కేసులో అప్రూవర్ గా మారిన అనంతరం దస్తగిరి బెయిల్ పై బయటికి వచ్చాక, ఓ ప్రేమ జంట వ్యవహారంలో కిడ్నాప్, దాడి కేసుల్లో ఇరుక్కున్నాడు. ఇటీవలే దస్తగిరికి ఈ రెండు కేసుల్లో బెయిల్ లభించడంతో కడప జైలు నుంచి విడుదలయ్యాడు.

More Telugu News