Jagan: జగన్ అధ్యక్షతన కొనసాగుతున్న కీలక భేటీ.. 'మేము సిద్ధం.. మా బూత్ సిద్ధం' పేరుతో సమావేశం
- 175 అసెంబ్లీ, 25 ఎంపీ స్థానాలను గెలుచుకోవడమే లక్ష్యం
- పార్టీ నేతలను ఎన్నికలకు సమాయత్తం చేస్తున్న జగన్
- సమావేశానికి హాజరైన 175 నియోజకవర్గాలకు చెందిన నేతలు
ఏపీ ముఖ్యమంత్రి జగన్ అధ్యక్షతన కీలక సమావేశం జరుగుతోంది. రానున్న ఎన్నికల్లో అనుసరించాల్సి వ్యూహాలపై 175 నియోజకవర్గాలకు చెందిన నేతలకు జగన్ మార్గనిర్దేశం చేస్తున్నారు. మంగళగిరిలోని సీకే కన్వెన్షన్ సెంటర్ లో 'మేము సిద్ధం.. మా బూత్ సిద్ధం' పేరుతో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. మొత్తం 175 అసెంబ్లీ స్థానాలు, 25 పార్లమెంట్ స్థానాలను గెలుచుకోవడమే లక్ష్యంగా ఈ సమావేశం ద్వారా పార్టీ నేతలను ఎన్నికలకు జగన్ సమాయత్తం చేస్తున్నారు.
ఈ సమావేశానికి ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, నియోజకవర్గాల ఇన్ఛార్జీలు, పార్టీ జిల్లాల అధ్యక్షులు, రీజనర్ కోఆర్డినేటర్లు, నియోజకవర్గ పరిశీలకులు, మండల పార్టీ అధ్యక్షులు, జగనన్న సచివాలయ కన్వీనర్లు హాజరయ్యారు. వచ్చే నెల 3వ తేదీన పల్నాడులోని పిచ్చికలపాడులో 'సిద్ధం' చివరి సభను నిర్వహించబోతున్నారు. ఆ తర్వాత ఎన్నికల ప్రచారానికి జగన్ శ్రీకారం చుడతారు. ఇప్పటి వరకు భీమిలి, దెందులూరు, రాప్తాడులలో మూడు 'సిద్ధం' సభలను నిర్వహించారు.