Shahrukh Khan: 'లట్ పుట్ గయా' పాట పాడిన అల్లు అర్జున్ తనయుడు... షారుఖ్ ఖాన్ ఫిదా

Shahrukh Khan appreciates Allu Ayaan

  • షారుఖ్ ఖాన్ కొత్త చిత్రం 'డంకీ'
  • హిట్టయిన 'లట్ పుట్ గయా' పాట
  • కారులో వెళుతూ ఆలపించిన అల్లు అయాన్
  • "థాంక్యూ చిన్నోడా" అంటూ స్పందించిన షారుఖ్ ఖాన్
  • ఇక మా పిల్లలు 'శ్రీవల్లి' పాటపాడతారేమో అంటూ చమత్కారం

బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ నటించిన కొత్త చిత్రం 'డంకీ'. అందులో అరిజిత్ సింగ్ పాడిన 'లట్ పుట్ గయా' అనే పాట విశేష ప్రజాదరణ పొందింది. కాగా, ఈ పాటను టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తనయుడు అల్లు అయాన్ కారులో వెళుతూ ఆలపించగా, ఆ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. 

ఈ వీడియో షారుఖ్ ఖాన్ దృష్టిలో పడింది. దాంతో ఆయన వెంటనే స్పందించారు. "థాంక్యూ చిన్నోడా! నువ్వు మామూలోడివి కాదు... ఫ్లవరు, ఫైరు రెండూ నీలో ఉన్నాయి. ఇప్పుడు మా పిల్లలు అల్లు అర్జున్ 'శ్రీవల్లి' పాట పాడడం ప్రారంభిస్తారేమో" అంటూ చమత్కరించారు. 

దీనిపై అల్లు అర్జున్ స్పందించారు. "షారుఖ్ గారూ... మీరెంత మంచివాళ్లు! మీ చక్కని సందేశం పట్ల ముగ్ధుడ్నయ్యాను. మీకు నా ప్రేమాభిమానాలు" అంటూ ట్వీట్ చేశారు.

Shahrukh Khan
Allu Ayaan
Allu Arjun
Lutt Putt Gaya
Dunki

More Telugu News