Telangana: ఇక ఆ రెండు గ్యారెంటీల అమలు... తెలంగాణ ప్రభుత్వ ఆహ్వాన పత్రిక

Telangnana government invitation for another two schemes

  • రేపు సాయంత్రం రూ.500కే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకాల అమలు ప్రారంభం
  • ఆహ్వాన లేఖను విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వం
  • ముఖ్య అతిథిగా రేవంత్ రెడ్డి, విశిష్ట అతిథిగా మల్లు భట్టి విక్రమార్క హాజరు

తెలంగాణ ప్రభుత్వం మరో రెండు పథకాలను మంగళవారం ప్రారంభించనుంది. కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు ఆరు గ్యారెంటీలు ఇచ్చింది. ఇందులో ఇప్పటికే కొన్నింటిని అమలు చేశారు. తాజాగా మరో రెండు పథకాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేపు సాయంత్రం ప్రారంభించనున్నారు. ఇందుకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం ఆహ్వాన లేఖను విడుదల చేసింది.

గృహ జ్యోతి 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రూ.500లకే గ్యాస్ సిలిండర్ పథకాల ప్రారంభోత్సవ కార్యక్రమం రేపు సాయంత్రం 4 గంటలకు రంగారెడ్డి జిల్లా చేవెళ్ల ఫరా ఇంజినీరింగ్ కాలేజీలో జరగనుందని ఆహ్వాన పత్రికలో పేర్కొంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీఎం రేవంత్ రెడ్డి వస్తున్నారని, విశిష్ట అతిథిగా మల్లు భట్టి విక్రమార్క వస్తున్నట్లు పేర్కొంది. సభాధ్యక్షులుగా ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యవహరించనున్నట్లు ఆహ్వాన పత్రికలో పేర్కొన్నారు.

Telangana
Revanth Reddy
Mallu Bhatti Vikramarka
Congress
  • Loading...

More Telugu News