Raghu Rama Krishna Raju: సీబీఎన్ ఫోరం మహిళా సైనికులతో రఘురామ సమావేశం... వీడియో ఇదిగో!
- ఏపీ విద్యా వ్యవస్థపై రఘురామ స్పందన
- జగన్ నాశనం చేస్తున్నాడని వ్యాఖ్యలు
- ప్రజలను ఫూల్స్ చేస్తున్నాడని విమర్శలు
నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు నేడు హైదరాబాదులో సీబీఎన్ ఫోరం మహిళా సైనికులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన ఏపీ రాజకీయ పరిస్థితులపై తనదైన శైలిలో స్పందించారు. ముఖ్యంగా, రాష్ట్రంలో విద్యా వ్యవస్థపై తన అభిప్రాయాలను పంచుకున్నారు. అదే సమయంలో సీఎం జగన్ పై విమర్శనాస్త్రాలు సంధించారు.
పిల్లలు ఎదిగే వయసులో మాతృభాషలో విద్యాబోధన చేయడం వల్ల చక్కగా నేర్చుకుంటారని అనేక అధ్యయనాలు చెబుతున్నాయని రఘురామ వివరించారు. కానీ ఈయన ఏం చదివారో తెలియదు... ఫస్ట్ క్లాస్ అని చెబుతుంటాడని ఎద్దేవా చేశారు.
"మనకు తెలిసింది ఏంటంటే... కొడై ఇంటర్నేషనల్ స్కూల్లో ఫస్ట్ స్టాండర్డ్ లో వేస్తే హెడ్ మాస్టర్ కొడుకును కొట్టాడు. ఫస్ట్ క్లాస్ లోనే... అతడ్ని పంపించివేశారు. దాంతో ఇక్కడ హెచ్ పీఎస్ లో చేర్చారు. ఆ తర్వాత కాలేజ్ ఎక్కడ చేశాడేంటో మనకు తెలియదు కానీ... మన విద్యావ్యవస్థను అందంగా బలి తీసుకుంటున్నాడు. తనను ఒక మహానువభావుడిలా సృష్టించుకుంటున్నాడు.
సీబీఎస్ఈ వాళ్లు ఎందుకు ఛీకొట్టారో చెప్పడు. అంతకంటే మంచిది తీసుకువచ్చానని అంటాడు. మన టీచర్లకు సీబీఎస్ఈ, ఐబీ సిలబిస్ బోధించే స్థాయిలో శిక్షణ ఉందా? అనేది ఆలోచించాలి. వాస్తవం ఏంటంటే... ఆ అత్యున్నత స్థాయి సిలబస్ ను బోధించే సామర్థ్యం ఈ ఉపాధ్యాయులకు లేదు, వాళ్లే ఇంకో రెండు మూడేళ్లు చదువుకుంటేనే గానీ ఆ సిలబస్ బోధించలేరు. ఈ టీచర్లను మార్చడు, కొత్త టీచర్లను వేయడు... వీళ్లే ఈ చదువు చెప్పాలని అంటాడు. ఆ విద్యార్థుల పరిస్థితి ఏంటి?
విదేశాలకు వెళ్లే వారి ఇంగ్లీషు భాషా నైపుణ్యాన్ని పరీక్షించడానికి టోఫెల్ పరీక్ష పెడతారు. ఆ టోఫెల్ వారితో పిల్లలకు శిక్షణ ఇప్పిస్తానంటాడు. ప్రజలను ఫూల్స్ ను చేస్తూ సంక నాకించడానికి ఇతడు తయారయ్యాడు. తనను తాను మహానుభావుడిలా... వాళ్లను, వీళ్లను కూర్చోబెట్టుకుని... నువ్వు ఫూలేవి, గట్టిగా మాట్లాడితే నువ్వు గాంధీవి... ఫూలే, గాంధీని గ్రైండర్ లో వస్తే నువ్వు పుట్టావ్... అని పొగిడించుకుంటూ విద్యా వ్యవస్థను నాశనం చేస్తున్నాడు" అంటూ రఘురామ ధ్వజమెత్తారు.