Floating Sea Bridge: విశాఖపట్నం ఆర్కే బీచ్ లో ఫ్లోటింగ్ బ్రిడ్జి ప్రారంభం

Floating Sea Bridge Opened At Visakha RK Beach

  • బ్రిడ్జిని ప్రారంభించిన ఎంపీ వైవీ సుబ్బారెడ్డి, అమర్నాథ్
  • పర్యాటకులకు అందుబాటులోకి వచ్చిన మరో ఆకర్షణ
  • రూ. 1.60 కోట్లతో ఏర్పాటు చేసిన ఏపీ ప్రభుత్వం

విశాఖపట్నంలోని ఆర్కే బీచ్ లో ఫ్లోటింగ్ బ్రిడ్జి పర్యాటకులకు అందుబాటులోకి వచ్చింది. రూ.కోటీ అరవై లక్షలతో జగన్ ప్రభుత్వం ఈ బ్రిడ్జిని ఏర్పాటు చేసింది. రాజ్యసభ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి, మంత్రి గుడివాడ అమర్నాథ్ ఆదివారం ఈ బ్రిడ్జిని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ.. విశాఖ చాలా ప్రశాంతమైన నగరమని అన్నారు. బీచ్‌లో ఏర్పాటు చేసిన ప్లోటింగ్ వంతెన వల్ల పర్యాటకుల సంఖ్య పెరుగుతుందని చెప్పారు. సీఎం జగన్‌ రాష్ట్రంలో వివిధ బీచ్‌ల అభివృద్ధికి కృషి చేస్తున్నారని అన్నారు. రాబోయే రోజుల్లో విశాఖలో పరిపాలన రాజధాని ముఖ్యమంత్రి ప్రారంభించే కార్యక్రమం ఉంటుందని చెప్పారు.

అందమైన బీచ్ లతో విశాఖపట్నం తెలుగు రాష్ట్రాల పర్యాటకులను ఆకర్షిస్తోంది. రామ‌కృష్ణ బీచ్‌, కైలాసగిరి, తోట్లకొండ, డచ్ సమాధులు, ఋషికొండ బీచ్, భీమిలి బీచ్.. వీటికి తోడు తాజాగా ఫ్లోటింగ్ బ్రిడ్జి మరో ఆకర్షణగా మారనుంది. సముద్రంలో ఎగిసిపడే కెరటాలను దగ్గరగా చూడడంతో పాటు వాటిపై తేలియాడవచ్చు. పర్యాటకులకు ఇదొక మరపురాని అనుభూతిగా మిగులనుంది. విశాఖ మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్ మెంట్ అథారిటీ ఈ బ్రిడ్జిని ఏర్పాటు చేసింది.

  • Loading...

More Telugu News