Koala: మరణం ఎవరికైనా బాధాకరమే! ఇంటర్నెట్‌లో కన్నీరు పెట్టిస్తున్న వీడియో ఇదిగో!

Koala Video that goes viral on internet

  • చనిపోయిన ఆడ కోలాను పట్టుకుని రోదిస్తున్న మగ కోలా
  • ఒళ్లో పెట్టుకుని, హత్తుకుని ఏడుపు
  • వీడియోను షేర్ చేసిన కోలా రెస్క్యూ గ్రూప్

ఈ సృష్టిలో మరణం ఏ జీవికైనా ఒకటే. బాధించేది ఒక్కలానే. భావోద్వేగాలు మనుషులకు మాత్రమే సొంతమైన అంశం కాదు.. అన్ని ప్రాణుల్లోనూ అది ఉంటుంది. కాకపోతే మనిషి చేతల ద్వారా, మాటల ద్వారా దానిని వ్యక్తీకరిస్తాడు.. అంతే తేడా! సహచర కోలాను కోల్పోయిన ఓ కోలా దానిని పట్టుకుని రోదిస్తున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో కన్నీళ్లు తెప్పిస్తోంది. దక్షిణ ఆస్ట్రేలియాకు చెందిన కోలా రెస్క్యూ గ్రూప్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఈ వీడియోను షేర్ చేసింది. కోలా అనేవి ఎలుగుబంటిని పోలి ఉండే చిన్న జీవులు. ఆస్ట్రేలియాలో కనిపిస్తాయి. పూర్తి శాకాహార జీవులు.

ఆ వీడియోలో ఓ కోలా చనిపోయిన కోలాను తన ఒళ్లో పెట్టుకుని రోదిస్తోంది. దానిని తనివితీరా హత్తుకుని తన ప్రేమను చాటుకుంది. ఆ దృశ్యం చూసి కన్నీళ్లు పెట్టుకున్న స్థానికులు కోలా రెస్క్యూ టీంకు సమాచారం అందించారు. వారొచ్చి కోలాను తమ రక్షణలోకి తీసుకున్నారు. చనిపోయింది ఆడ కోలా అని గుర్తించారు. మగ కోలాకు ఆరోగ్య పరీక్షలు చేసిన అనంతరం దానిని అడవిలో విడిచిపెట్టారు. ఆడ కోలా మరణానికి కారణం తెలియరాలేదు.

View this post on Instagram

A post shared by KOALA RESCUE Inc (@koala_rescue)

Koala
Koala Rescue Group
Australia
Viral Videos
  • Loading...

More Telugu News