Narendra Modi: ప్రధాని మోదీ వైజాగ్ పర్యటన రద్దు!

Modis Vizag tour postponed

  • వైజాగ్‌లో మార్చి 1న హెచ్‌పీసీఎల్ నవీకరణ ప్రాజెక్టు ప్రారంభోత్సవం
  • ప్రధాని చేతులమీదుగా ప్రాజెక్టు ప్రారంభించేలా షెడ్యూల్ ఖరారు
  • విశాఖలో ఏయూ మైదానంలో అధికారుల ఏర్పాట్లు ప్రారంభం
  • ప్రధాని పర్యటన రద్దయినట్టు సమాచారం, తాత్కాలికంగా ఏర్పాట్లు నిలిపివేత

ప్రధాని నరేంద్ర మోదీ విశాఖ పర్యటన రద్దయినట్టు తెలుస్తోంది. హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ నవీకరణ ప్రాజెక్టు మార్చి 1న ప్రారంభించేందుకు మోదీ షెడ్యుల్ ఖరారైంది. ఈ మేరకు ప్రధాని బహిరంగ సభ కోసం ఏయూ మైదానంలో అధికారులు ఏర్పాట్లు కూడా ప్రారంభించారు. అయితే, తాజాగా ప్రధాని పర్యటన రద్దయినట్టు ఢిల్లీ నుంచి సమాచారం అందినట్టు తెలుస్తోంది. దీంతో, అధికారులు ఏర్పాట్లను తాత్కాలికంగా నిలిపివేశారు. అయితే, పర్యటన రద్దుపై అధికారికంగా ఎటువంటి ప్రకటన విడుదల కాలేదు.

Narendra Modi
Visakhapatnam District
Andhra Pradesh
BJP
YSRCP
  • Loading...

More Telugu News