New Criminal Laws: పీనల్ కోడ్ స్థానంలో కొత్త క్రిమినల్ చట్టాలు... జులై 1 నుంచి అమలు

New Criminal Laws will replace IPC and CrPC from July 1
  • ఇప్పటివరకు భారత్ లో ఐపీసీ, సీఆర్పీసీ, ఎవిడెన్స్ యాక్ట్ ల అమలు
  • వాటి స్థానంలో మూడు కొత్త చట్టాలకు కేంద్రం రూపకల్పన
  • గత పార్లమెంటు సమావేశాల్లో కొత్త చట్టాలకు ఆమోదం
  • రాజముద్ర వేసిన రాష్ట్రపతి ముర్ము
బ్రిటీష్ వలస పాలన నాటి క్రిమినల్ చట్టాలకు ఇక కాలం చెల్లింది. వాటి స్థానంలో కొత్త క్రిమినల్ చట్టాలను భారత కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చింది. ఈ కొత్త చట్టాలు జులై 1 నుంచి అమల్లోకి వస్తాయని కేంద్రం నేడు ప్రకటించింది. 

ఈ కొత్త చట్టాల పేర్లు భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక్ సురక్ష, భారతీయ సాక్ష్య. 

ఇండియన్ పీనల్ కోడ్-1860, కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ (సీఆర్పీసీ)-1973, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్-1872 చట్టాల స్థానంలో కొత్త చట్టాలు అమల్లోకి రానున్నాయి. 

ఈ మూడు చట్టాలకు పార్లమెంటు ఆమోదం లభించగా, గత డిసెంబరులో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కూడా రాజముద్ర వేశారు. తాజాగా, కొత్త క్రిమినల్ చట్టాల  అమలు తేదీపై గెజిట్ విడుదల చేశారు.
New Criminal Laws
IPC
CrPC
India

More Telugu News