Team India: రాంచీ టెస్టులో ముగిసిన రెండో రోజు ఆట... ఇంగ్లండ్ దే పైచేయి

Second day play concludes in Ranchi Test

  • టీమిండియా, ఇంగ్లండ్ మధ్య నాలుగో టెస్టు
  • తొలి ఇన్నింగ్స్ లో ఇంగ్లండ్ 353 ఆలౌట్
  • రెండో రోజు ఆట చివరికి తొలి ఇన్నింగ్స్ లో టీమిండియా 219-7
  • రాణించిన ఇంగ్లండ్ స్పిన్నర్లు బషీర్, హార్ట్ లే

రాంచీలో టీమిండియా, ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న నాలుగో టెస్టులో రెండో రోజు ఆట ముగిసింది. ఈ టెస్టులో టాస్ నెగ్గిన ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ లో 353 పరుగులు చేయగా... మొదటి ఇన్నింగ్స్ ఆరంభించిన టీమిండియా నేడు ఆట చివరికి 7 వికెట్లకు 219 పరుగులు చేసింది. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ స్కోరుకు ఇంకా 134 పరుగులు వెనుకబడే ఉంది. వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ ధ్రువ్ జురెల్ 30, కుల్దీప్ యాదవ్ 17 పరుగులతో క్రీజులో ఉన్నారు. 

ఇంగ్లండ్ స్పిన్నర్లు పిచ్ పరిస్థితులను సద్వినియోగం చేసుకుని టీమిండియాను దెబ్బతీశారు. షోయబ్ బషీర్ 4, టామ్ హార్ట్ లే 2 వికెట్లు పడగొట్టారు. సీనియర్ పేసర్ జేమ్స్ ఆండర్సన్ 1 వికెట్ తీశాడు. 

టీమిండియా తొలి ఇన్నింగ్స్ లో ఓపెనర్ యశస్వి జైస్వాల్ 73 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. కెప్టెన్ రోహిత్ శర్మ కేవలం 2 పరుగులకే అవుట్ కావడం టీమిండియా ఇన్నింగ్స్ పై ప్రభావం చూపింది.

Team India
England
2nd Day
Ranchi Test
  • Loading...

More Telugu News