Manchu Manoj: బేబీ బంప్ ఫొటోలు షేర్ చేసిన మనోజ్ భార్య మౌనిక

Manchu Manoj wife Mounika baby bump photos

  • గత ఏడాది పెళ్లి చేసుకున్న మనోజ్, మౌనిక
  • తన ప్రెగ్నెన్సీ విషయాన్ని గత డెసెంబర్ లో వెల్లడించిన మౌనిక
  • కొత్త సినిమాతో రీఎంట్రీ ఇస్తున్న మనోజ్

సినీ హీరో మంచు మనోజ్, దివంగత భూమా నాగిరెడ్డి కూతురు మౌనిక గత ఏడాది పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. మౌనిక ప్రస్తుతం గర్భవతి. తమ కుటుంబంలోకి మరో బుజ్జాయి వస్తున్నాడంటూ గత డిసెంబర్ లోనే మౌనిక తన ప్రెగ్నెన్సీ గురించి వెల్లడించింది. తాజాగా తన బేబీ బంప్ ఫొటోలను షేర్ చేసింది. ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వీరిద్దరికీ ఇది రెండో వివాహం కావడం గమనార్హం. తొలి భర్తతో మౌనికకు ధైరవ్ అనే కొడుకు ఉన్నాడు. ధైరవ్ ను కూడా మనోజ్ సొంత కొడుకుగానే చూసుకుంటున్నారు. పెళ్లి తర్వాత మనోజ్ స్పందిస్తూ... కలిసొచ్చే కాలానికి ఎదురొచ్చే కొడుకు పుడతాడని అంటూ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. కెరీర్ విషయాల్లోకి వస్తే కొత్త సినిమాతో రీఎంట్రీ ఇచ్చేందుకు మనోజ్ రెడీ అవుతున్నాడు. పిల్లల కోసం ఆట వస్తువులు, బొమ్మలు తయారు చేసి, అమ్మే కంపెనీని మౌనిక ప్రారంభించింది.

More Telugu News