Shanmukh Jaswanth: గంజాయి కేసులో అరెస్ట్ అయిన యూట్యూబర్ షణ్ముఖ్‌కు బెయిల్!

Shanmukh Jaswanth Got Bail In Drug Case

  • ప్రేమ పేరుతో షణ్ముఖ్ సోదరుడు తనను మోసం చేశాడంటూ యువతి ఫిర్యాదు
  • అరెస్ట్ చేసేందుకు ఇంటికి వెళ్తే గంజాయితో పట్టుబడిన షణ్మఖ్
  • బెయిలుపై బయటకు తీసుకొచ్చినట్టు లాయర్ కల్యాణ్ దిలీప్ సుంకర ఫేస్‌బుక్ పోస్ట్

గంజాయితో పట్టుబడిన యూట్యూబర్, బిగ్‌బాస్ ఫేం షణ్ముఖ్ జస్వంత్‌ బెయిలుపై బయటకొచ్చాడు. ప్రేమ పేరుతో తనను మోసం చేశాడంటూ షణ్ముఖ్ సోదరుడు సంపత్‌పై ఓ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు అతడిని అదుపులోకి తీసుకునేందుకు ఇంటికి వెళ్లగా అక్కడ షణ్ముఖ్ గంజాయి తాగుతూ కనిపించాడు. దీంతో పోలీసులు అతడిని కూడా అరెస్ట్ చేశారు.

ఈ కేసులో తాజాగా అతడికి బెయిలు లభించింది. షణ్ముఖ్‌ను బెయిలుపై బయటకు తీసుకొచ్చినట్టు పేర్కొంటూ అతడి తరపు లాయర్ కల్యాణ్ దిలీప్ సుంకర తన ఫేస్‌బుక్ ఖాతాలో పేర్కొన్నారు. షణ్ముఖ్‌తో కలిసి ఉన్న ఫొటోను కూడా షేర్ చేశారు. ‘ద బాయ్ ఈజ్ అవుట్. దిసీజ్ అవర్ లీగల్ టీం వర్క్’ అని ఆ పోస్టులో కల్యాణ్ సుంకర పేర్కొన్నారు. కాగా, బెయిలుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Shanmukh Jaswanth
Ganja
Shanmukh Arrest
Drug Case
YouTuber
Kalyaan Dileep Sunkara
  • Loading...

More Telugu News