WPL-2024: బెంగళూరులో అట్టహాసంగా ప్రారంభమైన డబ్ల్యూపీఎల్-2024

WPL2024 Starts in grand style

  • ఐపీఎల్ బాటలో మహిళా క్రికెటర్ల కోసం డబ్ల్యూపీఎల్
  • నేటి నుంచి రెండో సీజన్ 
  • ఆటపాటలతో అలరించిన బాలీవుడ్ హీరోలు
  • ప్రారంభ మ్యాచ్ లో ముంబయి ఇండియన్స్ × ఢిల్లీ క్యాపిటల్స్ 

ఐపీఎల్ తరహాలోనే మహిళా క్రికెటర్ల కోసం భారత్ లో గతేడాది నుంచి ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) పోటీలు జరుపుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, టాటా డబ్ల్యూపీఎల్-2024 సీజన్ నేడు ఘనంగా ప్రారంభమైంది. 

బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో అట్టహాసంగా ప్రారంభ వేడుకలు నిర్వహించారు. బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ ప్రత్యేకంగా ఐదు టీమ్ ల కెప్టెన్లను పరిచయం చేసుకుని, తనదైన శైలిలో వీక్షకులను అలరించారు. 

ఎంతో ఉత్సాహంగా కనిపించిన షారుఖ్ ఖాన్... ఆ తర్వాత స్టేజిపైకి వచ్చిన యువ హీరోలు టైగర్ ష్రాఫ్, వరుణ్ ధావన్, షాహిద్ కపూర్, సిద్ధార్థ్ మల్హోత్రాలతో కలిసి సందడి చేశారు. యువ హీరోల డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ ఆడియన్స్ ను ఆకట్టుకుంది. 

టాస్ గెలిచిన ముంబయి ఇండియన్స్

డబ్ల్యూపీఎల్-2024 సీజన్ ప్రారంభ మ్యాచ్ లో ముంబయి ఇండియన్స్ ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు తలపడుతున్నాయి. టాస్ గెలిచిన ముంబయి ఇండియన్స్ బౌలింగ్ ఎంచుకుంది. ముంబయి ఇండియన్స్ కు హర్మన్ ప్రీత్ కౌర్ నాయకత్వం వహిస్తుండగా, ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు మెగ్ లానింగ్ కెప్టెన్ గా వ్యవహరిస్తోంది.

WPL-2024
Opening Ceremony
Bengaluru
India
Cricket

More Telugu News