CM Revanth Reddy: మేడారం చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి... వనదేవతలకు పూజలు

CM Revanth Reddy arrives Medaram

  • మేడారం జాతరకు సీఎం రేవంత్ రెడ్డి
  • ఘనస్వాగతం పలికిన మంత్రి సీతక్క, అధికారులు
  • సమ్మక్క, సారలమ్మను దర్శించుకున్న సీఎం 

ఆసియా ఖండంలోనే అతిపెద్ద ఆదివాసీ ఉత్సవంగా పేరుగాంచిన మేడారం జాతర అత్యంత ఉత్సాహభరిత వాతావరణంలో కొనసాగుతోంది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఈ మధ్యాహ్నం మేడారం చేరుకున్నారు. 

హైదరాబాద్ నుంచి ప్రత్యేక హెలికాప్టర్ లో వచ్చిన ఆయనకు మంత్రి సీతక్క, అధికారులు ఘనస్వాగతం పలికారు. వనదేవతలు సమ్మక్క, సారలమ్మ అమ్మవార్లను సీఎం రేవంత్ రెడ్డి దర్శనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆచార సంప్రదాయాలను అనుసరించి అమ్మవార్లకు నిలువెత్తు బంగారం (బెల్లం) సమర్పించారు. 

మేడారం జాతరలో సీఎంతో పాటు అమ్మవార్ల దర్శనం చేసుకున్నవారిలో మంత్రులు శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కొండా సురేఖ, రాష్ట్ర సీఎస్ శాంతికుమారి కూడా ఉన్నారు.

CM Revanth Reddy
Medaram Jatara
Congress
Telangana
  • Loading...

More Telugu News