YS Jagan: సీఎం జగన్ ప్రాణాలకు నక్సల్స్, టెర్రరిస్టులు, సంఘ విద్రోహ శక్తుల నుంచి ముప్పు ఉందంటూ నిఘా నివేదిక

Life Threat for AP CM Jagan

  • సీఎం జగన్ భద్రతపై ఇంటెలిజెన్స్ డీజీపీ నివేదిక
  • సీఎం జగన్ కు ప్రాణహాని ఉందని వెల్లడి
  • ముఖ్యమంత్రికి అత్యంత భద్రత కల్పించాలని సిఫారసు
  • రెండు హెలికాప్టర్లు సిద్ధం చేసిన రాష్ట్ర ప్రభుత్వం

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రాణాలకు ముప్పు ఉందంటూ ఇంటెలిజెన్స్ డీజీపీ నివేదిక ఇచ్చారు. మావోయిస్టులు, ఉగ్రవాదులు, సంఘ విద్రోహ శక్తుల నుంచి సీఎం జగన్ కు ప్రాణహాని ఉందని ఆ నివేదికలో పేర్కొన్నారు. సీఎం జగన్ కు అత్యంత కట్టుదిట్టమైన భద్రత కల్పించాల్సి ఉందని డీజీపీ స్పష్టం చేశారు. మరి కొన్ని వారాల్లో ఏపీ ఎన్నికలకు వెళుతున్న నేపథ్యంలో ఈ నివేదిక ప్రాధాన్యత సంతరించుకుంది.  

ఈ క్రమంలో సీఎం జగన్ పర్యటనల కోసం రెండు హెలికాప్టర్లను ఏపీ ప్రభుత్వం సిద్ధం చేస్తోంది. ఒక హెలికాప్టర్ ను విజయవాడలో, మరో హెలికాప్టర్ ను విశాఖలో అందుబాటులో ఉంచనున్నారు. మెస్సర్స్ గ్లోబర్ వెక్ట్రా సంస్థ ఈ హెలికాప్టర్లను లీజుకు తీసుకోనున్నారు. ఇవి రెండు ఇంజిన్లు కలిగిన బెల్ తయారీ హెలికాప్టర్లు. 

ఒక్కో హెలికాప్టర్ కు నెలకు రూ.1.91 కోట్లు లీజు రూపేణా చెల్లించనున్నట్టు తెలుస్తోంది. ఇతర ఖర్చులను కూడా ప్రభుత్వమే చెల్లించనుంది. ఈ మేరకు మౌలిక వసతుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి యువరాజ్ ఉత్తర్వులు ఇచ్చారు. 

ప్రస్తుతం సీఎం వినియోగిస్తున్న హెలికాప్టర్ పాతదైపోయిందని ఏపీ ఏవియేషన్ కార్పొరేషన్ లిమిటెడ్ వెల్లడించింది. ప్రస్తుత హెలికాప్టర్ 2010 నుంచి వాడుకలో ఉన్నందున, దాన్ని మార్చాల్సి ఉందని వివరించింది.

YS Jagan
Life Threat
Intelligence Report
DGP
YSRCP
Andhra Pradesh
  • Loading...

More Telugu News