Nandamuri Mokshagna: నందమూరి మోక్షజ్ఞ నయా లుక్... అందుకేనా?

Nandamuri Mokshagna new look went viral

  • బాలయ్య నట వారసుడి కోసం అభిమానుల ఎదురుచూపులు
  • తాజాగా స్లిమ్ లుక్ తో ఉన్న మోక్షజ్ఞ ఫొటోలు వైరల్
  • వెండితెర ఎంట్రీ  కోసమేనంటూ అభిమానుల ఆనందోత్సాహాలు

విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు నట వారసుడిగా, తండ్రి పేరును నిలబెడుతూ నందమూరి బాలకృష్ణ దశాబ్దాల తరబడి అభిమానులను అలరిస్తున్నారు. అయితే బాలకృష్ణ వారసుడిగా నందమూరి మోక్షజ్ఞ సినిమా రంగంలోకి అడుగుపెట్టే విషయంలో ఇంకా స్పష్టత లేదు. అభిమానులు మాత్రం మోక్షజ్ఞ ఎంట్రీ ఎప్పుడెప్పుడా అని అత్యంత ఆసక్తిగా ఉన్నారు. 

తాజాగా, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న బాలకృష్ణ తనయుడి ఫొటోలు నందమూరి అభిమానుల ఆశలకు కొత్త రెక్కలు తొడుగుతున్నాయి. గతంలో కాస్తంత బొద్దుగా ఉన్న మోక్షజ్ఞ లేటెస్ట్ ఫొటోల్లో స్లిమ్ లుక్ తో హ్యాండ్ సమ్ గా కనిపిస్తున్నాడు. వెండితెర అరంగేట్రం కోసమే మోక్షజ్ఞ బరువు తగ్గాడంటూ ఫ్యాన్స్ ఆనందోత్సాహల్లో తేలిపోతున్నారు.

Nandamuri Mokshagna
New Look
Balakrishna
Tollywood
  • Loading...

More Telugu News