Kesineni Chinni: వైసీపీ నేతలతో జలీల్ ఖాన్ మంతనాలు.. రంగంలోకి కేశినేని చిన్ని

Kesineni Chinni meeting with Jaleel Khan

  • విజయవాడ పశ్చిమ టికెట్ కోసం వైసీపీ నేతలతో జలీల్ ఖాన్ మంతనాలు
  • బుజ్జగించే బాధ్యతలను చిన్నికి అప్పగించిన టీడీపీ నాయకత్వం
  • నిన్న రాత్రి జలీల్ తో భేటీ అయిన చిన్ని

టీడీపీ సీనియర్ నేత జలీల్ ఖాన్ పక్క చూపులు చూస్తున్నారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం టికెట్ కోసం ఆయన వైసీపీ నేతలతో మంతనాలు జరిపారు. ఈ విషయం విజయవాడ టీడీపీలో చర్చనీయాంశంగా మారింది. దీంతో, పరిస్థితిని చక్కదిద్దేందుకు టీడీపీ నేత కేశినేని చిన్నిని టీడీపీ హైకమాండ్ రంగంలోకి దించింది. ఈ క్రమంలో ఆయన నిన్న రాత్రి 10 గంటల సమయంలో జలీల్ ఖాన్ నివాసంలో భేటీ అయ్యారు. జలీల్ ఖాన్ తో కేశినేని చిన్ని సమావేశం ఫలించింది. రెండు రోజుల్లో టీడీపీ అధినేత చంద్రబాబు, యువనేత నారా లోకేశ్ ని జలీల్ ఖాన్ కలవబోతున్నారు. విజయవాడ పశ్చిమ టికెట్ ను జనసేనకు ఇస్తారనే ఊహాగానాల నేపథ్యంలో టీడీపీ టికెట్ ఆశిస్తున్న నేతలు అసంతృప్తికి గురవుతున్నారు. 

Kesineni Chinni
Jaleel Khan
Chandrababu
Nara Lokesh
Telugudesam
YSRCP
Vijayawada West
AP Politics
  • Loading...

More Telugu News