Roja: ఈ విషయం అర్థమైంది కాబట్టే భువనేశ్వరి తెలివిగా మాట్లాడారు: మంత్రి రోజా

Minister Roja responds on Nara Bhuvaneswari comments

  • కుప్పం నుంచి పోటీ చేస్తే నన్ను గెలిపిస్తారా? అంటూ భువనేశ్వరి వ్యాఖ్యలు
  • చంద్రబాబు పనైపోయిందన్న విషయం భువనేశ్వరి మాటలతో తెలుస్తోందన్న రోజా
  • కుప్పం సహా మొత్తం 175 స్థానాల్లో వైసీపీనే గెలుస్తుందని ధీమా

కుప్పంలో చంద్రబాబును 35 ఏళ్లుగా గెలిపిస్తున్నారు... ఈసారి నన్ను గెలిపిస్తారా? అంటూ నారా భువనేశ్వరి కుప్పంలో సరదాగా చేసిన వ్యాఖ్యలపై మంత్రి రోజా స్పందించారు. చంద్రబాబు పనైపోయిందని నారా భువనేశ్వరి ప్రసంగం చూస్తే స్పష్టంగా అర్థమవుతోందని అన్నారు. మేం ఏదైతే ఇన్ని రోజుల నుంచి చెప్పుకుంటూ వచ్చామో, ఇవాళ భువనేశ్వరి కూడా అదే చెప్పారని తెలిపారు. 

"చంద్రబాబుకు విశ్రాంతి తీసుకునే వయసొచ్చింది... కుప్పంలో పోటీ చేయాలని నాకు ఆసక్తిగా ఉంది అని నారా భువనేశ్వరి మనసులో మాట చెప్పడం చూసిన తర్వాత తన పనైపోయిందని చంద్రబాబుకు అర్థమై ఉంటుంది. 

మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు కుప్పం ప్రజలకు మంచినీరు కూడా ఇవ్వలేకపోయారు. ఈ నెల 26న సీఎం జగన్ వస్తున్నారు... కుప్పం ప్రజల చిరకాల కోరిక అయిన హంద్రీనీవా ద్వారా నీళ్లు ఇవ్వబోతున్నారు. 

వైసీపీ ప్రభుత్వం కుప్పంలో ప్రతి ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తోంది. ఈ విషయం అర్థమైంది కాబట్టే, నారా భువనేశ్వరి తెలివిగా మా ఆయన రెస్ట్ తీసుకోవాలి, నేను పోటీ చేస్తాను అని చెబుతున్నారు. ఇప్పటికైనా ఆమెకు అర్థమైందని అందరూ నవ్వుకుంటున్నారు. 

కుప్పం ప్రజలకే  ఏమీ చేయలేని చంద్రబాబు రాష్ట్ర ప్రజలకు కూడా ఏమీ చేయలేడని ప్రజలు తెలుసుకున్నారు. అందుకే 2024 ఎన్నికల్లో కుప్పం సహా 175కి 175 స్థానాల్లో వైసీపీని గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు" అంటూ రోజా వ్యాఖ్యానించారు.

Roja
Nara Bhuvaneswari
Chandrababu
Kuppam
YSRCP
TDP
  • Loading...

More Telugu News