Bheema: ఇంట్రడక్షన్ అదరగొట్టిన గోపీచంద్ .. 'భీమా' లిరికల్ సాంగ్ రిలీజ్!

Bheema Lyrical Song Released

  • 'భీమా'లో పోలీస్ ఆఫీసర్ గా గోపీచంద్ 
  • యాక్షన్ థ్రిల్లర్ జోనర్లో నడిచే కథాకథనాలు 
  • అందాల భామలుగా ప్రియా భవాని శంకర్ - మాళవిక శర్మ 
  • మార్చి 8వ తేదీన థియేటర్లకు వస్తున్న సినిమా  


గోపీచంద్ కథానాయకుడిగా 'భీమా' సినిమా రూపొందింది. యాక్షన్ థ్రిల్లర్ జోనర్లో రాధామోహన్ నిర్మించిన ఈ సినిమాకి, హర్ష దర్శకత్వం వహించాడు. ఈ సినిమాకి కథ .. స్క్రీన్ ప్లే .. సంభాషణలు ఆయనే అందించాడు. ఈ సినిమాలో గోపీచంద్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నాడు. ఆయన పేరే 'భీమా' .. అదే ఈ సినిమా టైటిల్. 

తాజాగా ఈ సినిమా నుంచి ఒక లిరికల్ సాంగును రిలీజ్ చేశారు. ఇది హీరో ఇంట్రడక్షన్ సాంగ్ .. ఆయన కండబలం .. గుండెబలం గురించి చెప్పే పాటన్నమాట. 'గల్లీ సౌండుల్లో నువ్వు బ్యాండు కొట్టు మామా, బాసు  .. బిందాసు వచ్చాడు చూడు భీమా' అంటూ ఈ పాట సాగుతోంది. గోపీచంద్ .. అతని బృందంపై ఈ పాటను చిత్రీకరించారు.

రవి బస్రూర్ స్వరపరిచిన బాణీ ఇది. గాయకుడైన సంతోష్ వెంకీతో కలిసి ఆయన ఈ పాటకి సాహిత్యాన్ని అందించాడు. బీట్ పరంగా చూస్తే బాగానే అనిపిస్తుంది. కానీ సాహిత్యం పరంగా చూస్తే, బరువు తక్కువగా అనిపిస్తుంది. ప్రియా భవాని శంకర్ - మాళవిక శర్మ కథానాయికలుగా నటించిన ఈ సినిమా, శివరాత్రి కానుకగా మార్చి 8వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.

More Telugu News