Stock Market: ట్రేడింగ్ చివర్లో వందల పాయింట్లు నష్టపోయిన స్టాక్ మార్కెట్లు
- 430 పాయింట్లు పతనమైన సెన్సెక్స్
- 141 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ
- రియాల్టీ మినహా అన్ని సూచీలకు నష్టాలే
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు భారీ నష్టాల్లో ముగిశాయి. ఈ ఉదయం లాభాల్లో ప్రారంభమైన మార్కెట్లు అదే ఊపును కొనసాగించాయి. అయితే ట్రేడింగ్ చివర్లో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపడంతో లాభాలు ఆవిరయ్యాయి. ట్రేడింగ్ చివర్లో మార్కెట్లు భారీగా పతనమయ్యాయి. ఈ క్రమంలో ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 434 పాయింట్లు నష్టపోయి 72,623కి దిగజారింది. నిఫ్టీ 141 పాయింట్లు కోల్పోయి 22,055కి పడిపోయింది. రియాల్టీ మినహా అన్ని సూచీలు ఈరోజు నష్టాలను మూటకట్టుకున్నాయి.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
టాటా స్టీల్ (1.99%), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (1.51%), జేఎస్ డబ్ల్యూ స్టీల్ (0.95%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (0.88%), సన్ ఫార్మా (0.31%).
టాప్ లూజర్స్:
ఎన్టీపీసీ (-2.76%), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ (-2.71%), విప్రో (-2.00%), హెచ్సీఎల్ టెక్నాలజీస్ (-1.72%), ఎల్ అండ్ టీ (-1.70%).