Dhanush: అది ధనుశ్ ఇష్టం .. నా ప్రమేయం లేదు: సోదరుడు సెల్వ రాఘవన్!

Rayan Movie Update

  • ధనుశ్ 50వ సినిమాగా సెట్స్ పై ఉన్న 'రాయన్' 
  • ఆయన స్వీయ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా 
  • సెల్వ రాఘవన్ స్క్రిప్ట్ అందించాడని టాక్ 
  • ఆ మాటలను కొట్టిపారేసిన సెల్వ రాఘవన్


మొదటి నుంచి కూడా ధనుశ్ కొత్తదనానికి ప్రాధాన్యతనిస్తూ వస్తున్నాడు. హీరోగా ఆయన నిలదొక్కుకోవడానికి ఇదొక కారణమని చెప్పుకోవాలి. ప్రస్తుతం ఆయన తన 50వ సినిమాకి సంబంధించిన పనులలో బిజీగా ఉన్నాడు. 'రాయన్' అనే టైటిల్ తో రూపొందుతున్న ఈ సినిమాకి ఆయనే దర్శకుడు. 

ఈ సినిమాకి ధనుశ్ సోదరుడు సెల్వ రాఘవన్ స్క్రిప్ట్ అందించినట్టుగా కోలీవుడ్ లో ఒక వార్త షికారు చేసింది. దీనిపై సెల్వ రాఘవన్ స్పందిస్తూ .. " ఇది ధనుశ్ డ్రీమ్ ప్రాజెక్టు. అన్ని విషయాలను తనే దగ్గరుండి చూసుకుంటున్నాడు. అందులో నా ప్రమేయమేమీ లేదు. నేను అందులో ఒక చిన్న రోల్ చేస్తున్నాను అంతే" అని అన్నాడు. 

ధనుశ్ జోడీగా అపర్ణ బాలమురళి నటిస్తుండగా, సందీప్ కిషన్ .. కాళిదాస్ జయరామ్ .. కీలకమైన పాత్రలను పోషిస్తున్నారు. ఏఆర్ రెహ్మాన్ ఈ సినిమాకి సంగీతాన్ని సమకూర్చుతున్నాడు. ధనుశ్ తన 51వ సినిమాను శేఖర్ కమ్ములతో చేయనున్నాడు. తెలుగు .. తమిళ భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది. 

Dhanush
Aparna Balamurali
Selva Raghavan
Rayan Movie
  • Loading...

More Telugu News