Pawan Kalyan: భీమవరంలో పవన్ కల్యాణ్ పర్యటన షురూ... ప్రముఖులతో భేటీలు

Pawan Kalyan tours in Bhimavaram

  • గత ఎన్నికల్లో భీమవరంలో ఓటమిపాలైన పవన్ కల్యాణ్
  • ఈసారి కూడా భీమవరం నుంచే పోటీ చేస్తారని ప్రచారం
  • పవన్ తాజా పర్యటనతో ఊహాగానాలకు మరింత బలం

జనసేనాని పవన్ కల్యాణ్ భీమవరంపై ప్రత్యేక దృష్టి సారించారు. గత ఎన్నికల్లో గాజువాకతో పాటు భీమవరంలోనూ పోటీ చేసిన పవన్ కల్యాణ్ రెండు చోట్లా ఓడిపోయారు. ఈసారి కూడా ఆయన భీమవరం నుంచి పోటీ చేస్తారని ప్రచారం జరుగుతోంది. 

ఈ నేపథ్యంలో, పవన్ కల్యాణ్ నేడు భీమవరం విచ్చేశారు. వరుసగా ప్రముఖులను కలుస్తూ చర్చలు సాగిస్తున్నారు. ఈ  పరిణామాలు చూస్తే పవన్ భీమవరం నుంచి బరిలో దిగడం ఖాయమేననిపిస్తోంది. 

తొలుత... ఈ ఉదయం భీమవరంలో రాజ్యసభ మాజీ సభ్యురాలు, పశ్చిమ గోదావరి జిల్లా టీడీపీ అధ్యక్షురాలు తోట  సీతారామలక్ష్మి నివాసానికి వెళ్లిన పవన్ కల్యాణ్ ఆమెతో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. తాజా రాజకియ పరిస్థితులపై చర్చించారు. ఈ సమావేశంలో జనసేన, టీడీపీ నేతలు కూడా పాల్గొన్నారు. 

అనంతరం భీమవరం మాజీ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులుతో సమావేశమయ్యారు. ఆ తర్వాత పవన్ కల్యాణ్ భీమవరంలో బీజేపీ నేత పాకా సత్యనారాయణ నివాసానికి వెళ్లారు.

Pawan Kalyan
Bhimavaram
Janasena
Assembly Elections
Andhra Pradesh
  • Loading...

More Telugu News